తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా… నిజామాబాద్ జిల్లాలో 13 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎంబీబీఎస్ తో పాటు స్టాఫ్ నర్స్ పోస్టులున్నాయి. నవంబర్ 6వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా… నవంబర్ 9, 2024తో పూర్తి కానుంది.
మొత్తం 13 పోస్టులను రెండు కేటగిరీలుగా విభజించారు. ఎంఎల్ హెచ్ పీ ఎంబీబీఎస్, బీఏఎంస్ డాక్టర్స్ తో పాటు స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 29,900 జీతం ఉంది. డాక్టర్లకు నెలకు రూ. 40వేల జీతం చెల్లిస్తారు. ఎంబీబీఎస్, ఆయుర్వేద డిగ్రీ, జీఎన్ఎం ల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టును బట్టి అర్హతలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 46 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ఈ రిక్రూట్ మెంట్ ను పూర్తి చేస్తుంది. మొత్తం 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేపడుతారు. అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను ప్రిపేర్ చేస్తారు. డాక్టర్ పోస్టులను మల్జీ జోన్ ఆధారంగా, స్టాఫ్ నర్స్ పోస్టులను జోనల్ ఆధారంగా భర్తీ చేస్తారు.