TG Govt Jobs 2024 : తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి ఉద్యోగ ప్రకటన - మొత్తం 64 ఖాళీలు, ముఖ్య వివరాలివే
ఉద్యోగాల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా…64 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన వారు నవంబర్ 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
వసివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రకటన జారీ చేసింది. మొత్తం 64 ఖాళీలు ఉండగా… వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ పరిధిలోని టీవీవీపీ ఆసుపత్రుల్లో పని చేయాలి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 26వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
మొత్తం 64 పోస్టులు ఉండగా… అనస్తీషియా విభాగంలో 11, పీడియాట్రిక్స్ విభాగంలో 12 ఖాళీలున్నాయి.జనరల్ మెడిసిన్ విభాగంలో 10, రేడియాలజీ విభాగంలో 8 పోస్టులు ఉండగా… జనరల్ సర్జరీ విభాగంలో మరో 4 ఉన్నాయి.ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా, పీజీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉండాలి. దీనికితోడూ పని అనుభవం ఉండాలి. 46 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ.1,00,000 జీతం చెల్లిస్తారు.విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను ప్రకటిస్తారు. https://hyderabad.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తి చేసి ప్రొగ్రామ్ ఆఫీసర్ (హెచ్ఎస్ అండ్ ఐ), ఫోర్త్ ఫ్లోర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఖైరతాబాద్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి. నవంబర్ 26వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది.
జత చేయాల్సిన పత్రాలు :
- పదో తరగతి మెమో
- స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లు (ఒకటి నుంచి 7వ తరగతి)
- పీజీ, డిగ్రీ మార్కుల మెమోలు
- కుల ధ్రువీకరణపత్రం
- ఈడబ్యూఎస్ అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రం సమర్పించాలి
- ఆధార్ కార్డ్
- దివ్యాంగ అభ్యర్థులు సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి.
- అప్లికేషన్ లింక్ - https://hyderabad.telangana.gov.in/notice/recruitment-for-the-posts-of-civil-assistant-surgeon-specialists-on-contract-basis-in-tvvp-hospitals-in-hyderabad-district/