Meerpet Murder : తెలంగాణలో దారుణం- భార్యను చంపి ముక్కలుగా చేసి, కుక్కర్ లో ఉడికించిన భర్త
Meerpet Murder : రంంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతిదారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసి..వాటిని కుక్కర్లో ఉడికించాడో భర్త. అనంతరం భార్య శరీర ముక్కలను పొడి చేసి జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు.
Meerpet Murder : తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ లో ఈ దారుణం జరిగింది. ఈ నెల 18న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదని భర్త గురుమూర్తి...భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. భార్యాభర్తలు గురుమూర్తి, వెంకట మాధవి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు ఉన్నాయని, తరచూ గొడవపడుతుండేవారని పోలీసులకు తెలిసింది. దీంతో భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు.
కుక్కర్ లో ఉడికించి
తన భార్యను తానే హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్క ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించానని చెప్పాడు. అనంతరం ఆ ముక్కలను జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు చెప్పాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైరైనట్లు పోలీసులు గుర్తించారు. వీరికి ఇద్దరు సంతానం. వెంకట మాధవి మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
అనుమానంతో
ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి వృత్తిరీత్యా డీఆర్డీవోలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ.. జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి(35)తో కలిసి జీవిస్తున్నాడు. వీరి సంసారంలో అనుమానం తలెత్తింది. దీంతో గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అనుమానించేవాడు. ఈ విషయమై ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది.
దీంతో ఆగ్రహానికి లోనైనా గురుమూర్తి భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు. కమర్షియల్ సిలిండర్ తెచ్చి ముక్కలను ఉడకబెట్టాడు. అనంతరం కొన్ని ముక్కలను ఎండబెట్టి పొడిగా మార్చాడు. మృతదేహం పొడిని బకెట్‌లో తీసుకువెళ్లి జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు.
వెంకట మాధవి మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ల కోసం పోలీసులు చెరువులో గాలిస్తున్నారు. పొడి కావడంతో ఎలాంటి ఆనవాళ్లు దొరకడంలేదని తెలుస్తోంది. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకంల రేపుతోంది.