TG RYV Notification: తెలంగాణలో రాజీవ్ యువ వికాసం నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి ఇలా..ఏప్రిల్ 5 గడువు
TG RYV Notification: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకానికి దరఖాస్తు చేసుకోడానికి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టారు.
TG RYV Notification: తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకానికి నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్, 19 బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్లు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (EBC) చెందిన యువతకు స్వయం ఉపాధి కల్పించుటకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.
రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకానికి అర్థులైన బీసీ, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్లు, EBC కార్పొరేషన్లు దరఖాస్తులు స్వీకరిస్తాయి
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి (1) ఆధార్ కార్డు) (2) రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం (3) కులం ధ్రువీకరణ పత్రం (1) పట్టాదార్ పాస్ బుక్ (5) నీటిపారుదల సంబంధిత పథకాలకు (6) సదరం సర్టిఫికెట్ వికలాంగులకు (T) రవాణా సంబంధిత పథకాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉంటుంది.
వయసు పరిమితి:
సాధారణ పధకాల కోసం 21-55 ఏళ్ల వయస్కులు, వ్యవసాయం వృత్తి చేసే వారికి 21-60 ఏళ్లు అర్హతగా నిర్ణయించారు.
గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50 లక్షల ఆదాయ పరిమితి, పట్టణ ప్రాంతంలో రూ. 2.00 లక్షల ఆదాయం ఉన్నట్టు ఏడాది లోపు తీసుకున్న ధృవీకరణ పత్రం ఉండాలి.
దరఖాస్తు చేయడం ఇలా…
రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ TGOBMMS పోర్టల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. BC, MBC | కార్పొరేషన్తో పాటు 19 కులాలకు సంబంధించిన బిసి కార్పొరేషన్లు, ఫెడరేషన్లు మరియు EBC బోర్డులో ఎవరికి సంబంధించిన వివరాలు వారికి సంబంధించిన పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://tgobmmsnew.cgg.gov.in/ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి చివరి తేది: 2025 ఏప్రిల్ 5లోగా దరఖాస్తులు అందించా్లసి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/ ఈడీ బీసీ కార్పొరేషన్ కార్యాలయాలను సంప్రదించాలని, ఈ అవకాశాన్ని వెనుకబడిన తరగతుల యువతీ యువకులు వినియోగించు కోవాల్సిందిగా వీసీ అండ్ ఎండీ మల్లయ్య బట్టు సూచించారు.
మార్గదర్శకాలు - ముఖ్యమైన వివరాలు
- రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద… కుటుంబం నుంచి ఒక్కరికే పథకాన్ని వర్తింపజేస్తారు.
- రూ. 50 వేల విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ ఇవ్వనున్నారు.
- మొత్తం యూనిట్లలో 25 శాతం మహిళలకు కేటాయిస్తారు. ఒంటరి, వితంతు మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది.
- దివ్యాంగులకు, తెలంగాణ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి కూడా ఈ స్కీమ్ లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల వార్షికాదాయం, పట్టణ(మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ) ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు అర్హులవుతారు.
- స్కీమ్ లో వ్యవసాయతేర, వ్యవసాయ అనుబంధ యూనిట్లు ఉన్నాయి. దీంతో వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు వయసు 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. వ్యవసాయేతర కేటగిరీలకు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ ఉంటుంది. రూ.4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు 70 శాతం రాయితీ ఇస్తారు. మిగతాది బ్యాంకు రుణంగా అందిస్తుంది.
- దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ కన్వీనర్ గా ఉంటారు.
- పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషన్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
- జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా డీఆర్‌డీఏ పీడీ ఉంటారు.
సంబంధిత కథనం