Rajiv Gandhi Civils Abhayahastam : సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి రూ. లక్ష ఆర్థిక సాయం - దరఖాస్తుల గడువు పొడిగింపు-rajiv gandhi civils abhayahastam application date extended date and direct link check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rajiv Gandhi Civils Abhayahastam : సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి రూ. లక్ష ఆర్థిక సాయం - దరఖాస్తుల గడువు పొడిగింపు

Rajiv Gandhi Civils Abhayahastam : సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి రూ. లక్ష ఆర్థిక సాయం - దరఖాస్తుల గడువు పొడిగింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 09, 2024 05:07 AM IST

TG Govt Rajiv Gandhi Civils Abhayahastam : రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం స్కీమ్ కు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. దరఖాస్తుల గడువును ఆగస్టు 12వ తేదీ వరకు పొడిగించారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు ఎంపికైనవారికి ఆర్థిక సాయం అందించటే ఈ స్కీమ్ ఉద్దేశ్యం.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం స్కీమ్
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం స్కీమ్

Rajiv Gandhi Civils Abhayahastam : సింగరేణి కాలరీస్ సామాజిక బాధ్యతతో చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం గడువును ఈ నెల 12 తేదీ వరకు పొడిగించినట్లు సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ బలరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధిస్తే సింగరేణి తరఫున రూ.లక్ష ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చేతుల మీదుగా గత నెల 20వ తేదీన ఈ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 6వ తేదీ వరకు గడువు విధించడం జరిగింది. అయితే గడువు పొడగించాల్సిందిగా అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 12 వ తేదీకు పెంచినట్లు ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సింగరేణి వెబ్సైట్ scclmines.com ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అర్హతలు

  • అభ్యర్థులు జనరల్(ఈడబ్ల్యూఎస్ కోటా)/బీసీ/ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారై ఉండాలి
  • అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయ్యి ఉండాలి.
  • యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించాలి.
  • వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
  • గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదు.
  • అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఒకే ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సహ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.

దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు దాదాపుగా 14 లక్షల మంది రాస్తున్నట్లు అంచనా. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి సుమారు 50 వేల మంది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో సుమారుగా 400 నుంచి 500 వరకు ప్రిలిమ్స్ లో అర్హత సాధిస్తున్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా అర్హులైన సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందించనుంది.