Rajanna Sircilla : సిరిసిల్ల జిల్లాలో బాలుడి ఆత్మహత్య.. బాలికకు న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని..-rajanna sircilla boy kills self after row over new year wishes to female classmate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rajanna Sircilla : సిరిసిల్ల జిల్లాలో బాలుడి ఆత్మహత్య.. బాలికకు న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని..

Rajanna Sircilla : సిరిసిల్ల జిల్లాలో బాలుడి ఆత్మహత్య.. బాలికకు న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని..

Rajanna Sircilla : కొత్త సంవత్సరం ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. క్లాస్‌మేట్‌కు న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని.. బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని బెదిరించారు. దీంతో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.

బాలుడి ఆత్మహత్య (istockphoto)

రాజన్న సిరిసిల్ల జిల్లా ఘంబీర్రావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన బాలుడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. న్యూఇయర్ సందర్భంగా.. తన క్లాస్‌మేట్‌ (బాలిక)కు విషెస్ చెప్పాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ.. బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లికి బెదిరింపులు..

ఆ అబ్బాయి తల్లి కూడా.. అమ్మాయి కుటుంబం నుండి బెదిరింపులకు గురయ్యాడని చెప్పింది. ఈ పరిస్థితితో కుంగిపోయిన ఆమె కొడుకు చివరికి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పోలీసులు నిర్ధారించారు. అతని మరణ వార్త తెలియగానే.. అమ్మాయి కుటుంబం గ్రామం వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విషెస్ చెప్ప‌లేద‌ని..

సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటన జరిగితే.. ఏపీలో మరో ఇన్సిడెంట్ జరిగింది. బెస్ట్ ఫ్రెండ్ న్యూ ఇయ‌ర్ విషెస్ చెప్ప‌లేద‌ని విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌ చేసుకుంది. అనంత‌పురం జిల్లా విడ‌ప‌న‌క‌ల్లు మండ‌లం పాల్తూరు గ్రామానికి చెందిన.. చిన్న‌తిప్ప‌మ్మ (17) బ‌ళ్లా రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాల‌లో ఇంట‌ర్మీడియ‌ట్ సెకెండ్ ఇయ‌ర్ చ‌దువుతోంది. అక్క‌డే హాస్ట‌ల్‌లో ఉంటూ చ‌దువుకుంటుంది. చిన్న‌తిప్ప‌మ్మ‌కు అదే కాలేజీలోని ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థిని ఫ్రెండ్ ఉంది. వీరిద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఎక్క‌డికి వెళ్లినా ఇద్ద‌రూ క‌లిసేవెళ్లేవారు.

మనస్తాపానికి గురై..

అయితే మంగ‌ళ‌వారం రాత్రి హాస్ట‌ల్‌లోని స్టూడెంట్స్ అంతా న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ఆ వేడుక‌ల్లో చిన్న‌తిప్ప‌మ్మకు తన బెస్ట్ ఫ్రెండ్‌ విషెస్ చెప్ప‌లేదు. దీంతో త‌న బెస్ట్ ఫ్రెండే త‌న‌కు విషెస్ చెప్ప‌లేద‌ని మ‌న‌స్తాపానికి గురైంది. బుధ‌వారం హాస్ట‌ల్‌లోని మెస్‌లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీన్ని గుర్తించిన తొటి విద్యార్థులు.. చిన్న‌తిప్ప‌మ్మ కుటుంబ స‌భ్యుల‌కు, కాలేజీ యాజ‌మాన్యానికి స‌మాచారం అందించారు.

అనుమానాలు..

విద్యార్థి మృతిపై ఆమె కుటుంబ స‌భ్యులు, బంధువులు అనుమానం వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న‌కు దిగారు. అనంత‌పురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వ‌ద్ద విద్యార్థి సంఘాల నేత‌ల‌తో క‌లిసి ఆందోళ‌న‌కు చేప‌ట్టారు. యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యంగా వ‌ల్ల‌నే విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని పేర్కొన్నారు. కాలేజీ యాజ‌మాన్యంపై కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌ ఘ‌ట‌న కాలేజీలో క‌ల‌క‌లం సృష్టించింది. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.