ఐఎండీ రెయిన్ అలర్ట్ - తెలంగాణలో మరో 3 రోజలు వర్షాలు…! ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు-rains likely for another three days in telangana imd weather updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఐఎండీ రెయిన్ అలర్ట్ - తెలంగాణలో మరో 3 రోజలు వర్షాలు…! ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

ఐఎండీ రెయిన్ అలర్ట్ - తెలంగాణలో మరో 3 రోజలు వర్షాలు…! ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు కురవనున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం… ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. కొన్నిచోట్ల 30 -40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రేపు(జూన్ 23) మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యయి.

ఎల్లుండి(జూన్ 24) రాష్ట్రంలోతేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. 30 -40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఏపీలో తేలికపాటి వర్షాలు:

ఏపీకి ఐఎండీ తేలికపాటి వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, విశాఖ,అనకాపల్లి,కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం,సత్యసాయి,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.