TG Weather ALERT : తీరం దాటిన వాయుగుండం..! తెలంగాణలో 5 రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు-rains are likely in telangana till october 21 imd latest weather updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Weather Alert : తీరం దాటిన వాయుగుండం..! తెలంగాణలో 5 రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

TG Weather ALERT : తీరం దాటిన వాయుగుండం..! తెలంగాణలో 5 రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 17, 2024 11:21 AM IST

వాయుగుండం గురువారం తెల్లవారుజాము సమయంలో తీరం దాటింది. వాయుగుండం చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటిందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తీరం దాటింది. చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటినట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
  • అక్టోబర్ 18 : ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
  • అక్టోబర్ 19 : ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాజ్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
  • అక్టోబర్ 20 : ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, కామారెడ్డి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల కారణంగా ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు,కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక రేపు చూస్తే… శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం