Telangana Rains : 4 రోజులపాటు భారీ వర్షాలు - హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన, రెడ్ అలర్ట్ జారీ..!
Rain in Hyderabad : హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. కూకట్ పల్లి, ప్రగతి నగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఎల్బీ నగర్, హయత్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
హైదరాబాద్ లో గురువారం వర్షం దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే ఇవాళ మధ్యాహ్నం తర్వాత మళ్లీ వాన మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, ప్రగతి నగర్, అమీర్ పేట్, సచివాలయం, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట, బాచుపల్లి, సనత్‌గనర్, ముషీరాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడటంతో రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది.
ఎల్బీ నగర్, హయత్ నగర్ తో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నగరంలో బలమైన ఉపరిత గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ అయింది. మరోవైపు మెదక్‌లో గంటన్నర నుంచి ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. వర్షపు నీటిలో బైక్‌లు కొట్టుకుపోయాయి. మెదక్‌లో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది.
భారీ వర్ష సూచన….
ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఆగస్టు 17వ తేదీ ఉదయం 8. 30 తర్వాత వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.