TS AP Weather Updates : చల్లబడిన హైదరాబాద్.. ఈనెల 17 వరకు తెలంగాణకు వర్ష సూచన!-rain in hyderabad city and thunder showers likely to occur till april 17 in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rain In Hyderabad City And Thunder Showers Likely To Occur Till April 17 In Telangana

TS AP Weather Updates : చల్లబడిన హైదరాబాద్.. ఈనెల 17 వరకు తెలంగాణకు వర్ష సూచన!

HT Telugu Desk HT Telugu
Apr 13, 2023 08:01 PM IST

Weather Updates Telugu States: హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా… సాయంత్రం వేళ పలుచోట్ల వర్షం కురిసింది.

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

Rains in Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఇవాళ హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా... సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసింది. భాగ్యనగరాన్ని మబ్బులు కమ్మేయగా... సాయంత్రం 5 తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

రెండు రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగర ప్రజలకు వరుణుడి రాకతో కాస్త ఉపశమనం దొరికినట్లు అయింది. ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చైతన్యపురి, మలక్‌పేట్, చార్మినార్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, కోఠి, అబిడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుసింది. మిగతా ప్రాంతాల్లోనూ వాతావరణం చల్లబడి, ఈదురుగాలులు వీస్తున్నాయి. వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్‌ అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 17వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 15, 16వ తేదీల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా తేదీల్లో మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది.

ఏపీలో భగభగలు..

Today Andhrapradesh Temperatures : ఏపీలో రోజురోజూకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు బెంబెలేత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండి అంచనాల ప్రకారం రేపు 7 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 106 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిచింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఒక వేళ బయటకు వెళ్తే ఎండ, వడగాల్పుల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తగినంత స్థాయిలో నీరు తాగాలని.. ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. బయటకు వెళ్లవలసి వస్తే… గొడుగు, టోపీ, సన్‌స్క్రీన్ ధరించాలని అడ్వైజ్ అధికారులు కూడా చేస్తున్నారు. కచ్చితంగా బయటకు వెళ్లవలసి వస్తే సాయంత్రం తర్వాత వెళ్తే బెటర్ అని చెబుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం