Telugu News  /  Telangana  /  Rain Hits Some Areas In Hyderabad City
భాగ్యనగరంలో వర్షం
భాగ్యనగరంలో వర్షం

Telangana Weather Updates: పలుచోట్ల చిరుజల్లులు - పెరగనున్న చలి తీవ్రత!

06 January 2023, 8:20 ISTHT Telugu Desk
06 January 2023, 8:20 IST

Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. మధ్యాహ్నం సమయంలో కూడా ఎండ రావటం లేదు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

Telangana Weather Updates: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రెండు మూడు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడుతోంది. కనీసం మధ్యాహ్నం సమయంలో కూడా ఎలాంటి మార్పులు ఉండటం లేదు. ఈ వేళలో కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. ఫలితంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల స్థాయి పడిపోతుండగా... మరోవైపు పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు హైదరాబాద్ నగరంలో వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి తర్వాత నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, శుక్రవారం వేకువఝామునే మరోసారి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు దాకా వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, తార్నాక, పంజాగుట్ట, చింతల్‌, బాలానగర్‌, సుచిత్ర, బేగంపేట్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉంటే భాగ్యనగరంలో చలి పంజా విసురుతోంది. గత మూడు రోజులుగా చలి తీవ్రత పెరగటంతో నగర వాసులు గజగజ వణికిపోతున్నారు.

ఇక హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. గురువారం వరంగల్ నగరంలో వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లగా ఉంది. ఈ అకాల వర్షాలపై తెలంగాణ వెథర్ మ్యాన్( స్పందిస్తూ... హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచుతో పాటు చిరుజల్లులు కురవటం అరుదైన దృగ్విషయమైని పేర్కొంది. వీటిని 'డ్రైలైన్ షవర్స్' అంటారని తెలిపింది. రేపట్నుంచి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.