Rahul Gandhi In Hyderabad : మోదీ స్నేహితుల జేబుల్లోకి లక్షల కోట్లు-rahul gandhi comments on pm modi and cm kcr at hyderabad in bharat jodo yatra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rahul Gandhi Comments On Pm Modi And Cm Kcr At Hyderabad In Bharat Jodo Yatra

Rahul Gandhi In Hyderabad : మోదీ స్నేహితుల జేబుల్లోకి లక్షల కోట్లు

HT Telugu Desk HT Telugu
Nov 01, 2022 08:23 PM IST

Rahul Gandhi Bharat Jodo Yatra In Hyderabad : హైదరాబాద్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. నెక్లెస్ రోడ్డు దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

చార్మినార్ వద్ద జాతీయ జెండా ఎగరేసిన రాహుల్ గాంధీ
చార్మినార్ వద్ద జాతీయ జెండా ఎగరేసిన రాహుల్ గాంధీ

భారత్ జోడో(Bharat Jodo Yatra) యాత్ర హైదరాబాద్ చేరుకుంది. తెలంగాణ(Telangana)లో ఇది 7వ రోజు. హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాల్గొన్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రదాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటలకే శంషాబాద్ నుండి ప్రారంభమైన యాత్ర చార్మినార్, గాంధిభవన్, నాంపల్లిల మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంది. దారి పొడవునా స్వాగత తోరణాలు, భారీగా జన సందోహం నడుమ రాహుల్ పాదయాత్ర జనసంద్రంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

రాహుల్(Rahul)ని స్వాగతించేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావటంతో కొన్ని ప్రాంతాల్లో భద్రత సమస్యలు తలెత్తాయి. నెక్లెస్ రోడ్డు(Necless Road)లోని సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇక్కడ దొరల పాలన, అక్కడ మత శక్తుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని రాహుల్ అన్నారు. సమైక్యవాద దేశాన్ని ముక్కల చేస్తున్న బీజేపీ(BJP) పాలనకు ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశంలో అత్యంత కాలుష్యం దిల్లీలో ఉందని, కానీ.. ఇప్పుడు దేశంలో అత్యంత కాలుష్యం హైదరాబాద్ లో ఉందన్నారు. కారణం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉంది. మోదీ, కేసీఆర్ నడుమ డైరెక్ట్ లింక్ ఉందని రాహుల్ ఆరోపించారు.

'దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు శూన్యం. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. లక్షలాది నిరుద్యోగులు ఫుడ్ డెలివరీ బాయ్స్(Food Delivery Boys) గా ఉన్నారు. ఇదేనా దేశ అబివృద్ధి. దేశంలోని ప్రభుత్వ సంస్థలన్నీ మోడి స్నేహితులకు వెళ్లిపోయాయి. బ్యాంకుల నుండి లక్షల కోట్లు మోడి తన స్నేహితులకు దోచిపెడుతున్నారు. గ్యాస్ సిలిండర్ నాలుగు వందలు ఉండేది 11 వందలు అయ్యింది. పెట్రోల్(Petrol) ఎంతైంది. ఒకవైపు దోచుకోవటం మరోవైపు సామాన్యుల నడ్డి విరచటం మోదీకి సర్వసాదారణం.' అని రాహుల్ గాంధీ అన్నారు.

అందుకే భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) ప్రారంభించానని రాహుల్ గాంధీ చెప్పారు. దేశ సమైక్యత కోసం యాత్ర సాగుతుందన్నారు. మీ ప్రేమ, మీ ఆదరణతో తాను ముందుకు సాగుతున్నానని చెప్పారు. అంతకుముందు చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.

WhatsApp channel