South Central Railway : వరంగల్ వాసులకు గుడ్‌న్యూస్.. రెండేళ్ల తర్వాత మళ్లీ వస్తున్న పేదల రైలు
South Central Railway : పుష్‌పుల్ ట్రైన్.. ఈ రైలుతో వరంగల్ జిల్లా ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. వరంగల్- సికింద్రాబాద్ మధ్య సేవలు అందించే ఈ రైలు రెండేళ్లుగా వరంగల్‌కు రావడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
పుష్‌పుల్ రైలుతో వరంగల్ జిల్లా ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. అతి తక్కువ టికెట్ ధరతో ఈ ట్రైన్‌లో సికింద్రాబాద్ చేరుకోవచ్చు. అంతేకాదు.. వరంగల్- సికింద్రాబాద్ మధ్య ప్రతీ స్టేషన్‌లో ఈ రైలుకు హాల్టింగ్ ఉంది. దీంతో చాలామంది ఈ రైలు సేవలను వినియోగించుకునే వారు. కానీ.. రెండేళ్లుగా ఈ ట్రైన్ వరంగల్ స్టేషన్‌కు రావడం లేదు.
పుష్‌పుల్ (07463) రైలును రెండేళ్ల తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ వరకు పొడిగించారు. గతంలో ఈ రైలు వరంగల్- సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్నం సమయంలో నడిచేది. అయితే.. మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా రెండు సంవత్సరాల నుంచి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. దీంతో పుష్‌పుల్ కాజీపేట- సికింద్రాబాద్ మధ్య తిరిగేది.
దీంతో వరంగల్ నుంచి రాజధానికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు.. శుక్రవారం నుంచి పుష్‌పుల్ రైలును వరంగల్ వరకు పొడిగించారు. ఇకనుంచి ప్రతీరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ రైలు వరంగల్ నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరనుంది. రెండేళ్ల తర్వాత పుష్‌పుల్ రావడంతో.. ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
33 ప్రత్యేక రైళ్లు..
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆదివారం (03.11.2024)న 33 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. తిరుపతి- మచిలీపట్నం, తిరుపతి- సికింద్రాబాద్ మధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ ఆదివారం అందుబాటులో ఉండనున్నాయి. నర్సాపూర్- హైదరాబాద్, సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య కూడా ప్రత్యేక రైళ్లు ఇవాళ సేవలు అందిచనున్నాయి.
విజయవాడ- విశాఖపట్నం, విశాఖపట్నం- విజయవాడ మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. తిరుపతి- శ్రీకాకుళం మధ్య కూడా ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ స్పెషల్ ట్రైన్స్ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.