Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం.. చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక దాడి-principal car dirver molested lkg student in hyderabad banjarahills ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Principal Car Dirver Molested Lkg Student In Hyderabad Banjarahills

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం.. చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక దాడి

HT Telugu Desk HT Telugu
Oct 19, 2022 08:58 AM IST

Rape Case In Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంకా కలకలం రేపింది.

బాలికపై లైంగిక దాడి
బాలికపై లైంగిక దాడి (HT_PRINT)

బంజారాహిల్స్(Banjara Hills) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ లో LKG చదువుతున్న నాలుగేళ్ల బాలికపై.. ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగికదాడి చేశాడు. చాలా రోజులుగా ఈ ఘటన జరుగుతూనే ఉంది. రెండు నెలలుగా బాలికను డ్రైవర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

బాలిక ప్రవర్తనలో చాలారోజులుగా మార్పులు వచ్చాయి. ఈ విషయంపై చాలాసార్లు ప్రశ్నించింది ఆమె తల్లి. చిన్నారి నిరసంగా మారిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పింది బాలిక. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

ప్రిన్సిపాల్ కారు డ్రైవర్(Principal Car Driver) గా పనిచేస్తున్న వ్యక్తే.. డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వచ్చి చిన్న పిల్లలను ఇబ్బందులు గురిచేశాడని ఫిర్యాదులో తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఆగ్రహంతో ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ ను తల్లిదండ్రులు కొట్టారు. డ్రైవర్ రజినీకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇతడు డ్రైవర్ గా చేయడంతోపాటుగా.. పాఠాలు కూడా చెబుతున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ గా ఉంటూ.. పాఠాలు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఏపీలోనూ ఇలాంటి ఘటనే..

ఏపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై విశాఖపట్నం(Visakhapatnam)లో 73 ఏళ్ల వృద్ధుడు పలుమార్లు లైంగికదాడి చేశాడు. వైజాగ్‌(Vizag)లోని ప్రత్యేక పోక్సో కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి నాలుగు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. మూడో తరగతి చదివే.. విద్యార్థినిని మొబైల్ గేమ్‌(Mobile Games)లతో ఆకర్షించి తన ఇంటికి తీసుకెళ్లేవాడు ఆ వ్యక్తి. అశ్లీల వీడియోలు చూపించేవాడు. బలవంతం చేసి లైంగికదాడి చేశాడని పోలీసులు చెప్పారు. ఐదు నెలల పాటు బాలికపై లైంగికదాడి చేశాడు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. బాలిక పరిస్థితి గమనించిన తల్లి ఆరా తీయగా.. అసలు విషయం తెలిసింది. బాలిక తన తల్లితో కలిసి జీవిస్తోందని పోలీసులు తెలిపారు. లైంగికదాడి చేసిన వ్యక్తి కూడా అదే ప్రాంతంలోనే నివసిస్తున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం