PM Modi On Medaram: “సమ్మక్క సారలమ్మకు ప్రణమిల్లుదామని” ప్రధాని మోదీ పిలుపు.. ఎక్స్‌లో శుభాకాంక్షలు…
PM Modi On Medaram: మేడారం జాతర ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. సమక్క సారలమ్మకు Sammakka Saralamma ప్రణమిల్లుదామని తెలుగులో పిలుపునిచ్చారు.
PM Modi On Medaram: మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు Wishesతెలిపారు. 'గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటి..మేడారం జాతర. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఈ జాతర. సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు ప్రదర్శించిన గొప్ప ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం'అని ట్వీట్టర్‌లో ప్రధాని పేర్కొన్నారు.
తెలంగాణ Telangana కుంభమేళాగా పిలిచే మేడారం మహా జాతర బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి Tadvaiమండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మొక్కులు, దర్శనం కోసం భారీగా తరలి వచ్చే వారితో మేడారం పరిసరాలు పూర్తి జనసంద్రంగా మారింది. ఫిబ్రవరి 24 వరకు ఈ జాతర జరగనుంది.
ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వేళైంది. ఇవ్వాళ సాయంత్రం సారలమ్మ మేడారం గద్దెలకు చేరుకోవడంతో మహాజాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో కాలినడకన బయలు దేరిన పెనక వంశస్తులు మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకున్నారు.
బుధవారం ఉదయం అక్కడి నుంచి మేడారం బయలుదేరారు. బుధవారం సాయంత్రంలోగా పగిడిద్దరాజు మేడారం చేరుకోనున్నారు. కాగా బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర ప్రారంభమవుతుంది.
మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం రోజున సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. గోవిందరాజు, పగిడిద్దరాజు కూడా సారలమ్మతో పాటే బుధవారమే గద్దెలపై కొలువుదీరుతారు.
బుధవారం సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులైన వడ్డెలు ప్రత్యేక పూజలు చేస్తారు. సారలమ్మ ప్రధాన పూజారి అయిన కాక సారయ్య వెదురుబుట్ట(మొంటె)లో అమ్మవారి ప్రతిరూపంగా భావించే పసుపు, కుంకుమలను భరిణె రూపంలో తీసుకుని కాలినడకన మేడారానికి చేరుకుంటారు.
అలా అమ్మవారిని తీసుకువస్తున్న క్రమంలో పూజారిని తాకడానికి భక్తులు చాలామంది ప్రయత్నిస్తుంటారు. సంతానం కోసం తపించే మహిళలు వరం పట్టి.. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా చీరలు పరిచి రోడ్డుపై పడుకుంటారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వారి పైనుంచే నడుచుకుంటూ మేడారం చేరుకుంటారు. మార్గమధ్యలో ఉన్న జంపన్నవాగు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆ తరువాత అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. అక్కడ సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణ తంతును నిర్వహించిన అనంతరం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి తీసుకువస్తారు.