PM Narendra Modi Adilabad: తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ.. ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభం-prime minister narendra modi dedicated the second unit of ntpc to the nation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Prime Minister Narendra Modi Dedicated The Second Unit Of Ntpc To The Nation.

PM Narendra Modi Adilabad: తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ.. ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభం

Sarath chandra.B HT Telugu
Mar 04, 2024 12:20 PM IST

PM Narendra Modi Adilabad: పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతి బీజేపీ పాలనకు అద్దం పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదిలాబాద్‌ పర్యటనలో ఎన్టీపీసీ రెండో యూనిట్‌ జాతికి అంకితం చేయడంతో పాటు పలు పనులను ప్రారంభించారు.

ఆదిలాబాద్‌లో ఎన్టీపీసీ రెండో యూనిట్‌ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ఆదిలాబాద్‌లో ఎన్టీపీసీ రెండో యూనిట్‌ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

PM Narendra Modi Adilabad: దేశంలో పదేళ్ల బీజేపీ పాలన రాష్ట్రాల్లో అభివృద్ధికి కొత్త నిర్వచనం చెబుతుందని ప్రధాని మోదీ Modi చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్టీపీసీ NTPC నిర్మించిన 80మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ Telangana సాధించిన ప్రగతిని దేశం మొత్తం గమనిస్తోందని, తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించినట్టు ప్రధాని మోదీ చెప్పారు. ఎన్టీపీసీ రెండో యూనిట్‌లో తక్కువ కార్బన్‌ ఉద్గారాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. రైల్వే లైన్‌ విద్యుదీకరణ పనులు, ఆదిలాబాద్‌-దేలా జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌Adilabad ను రైలు, రోడ్డు మార్గాలను ఆధునీకరించడం ద్వారా తెలంగాణలో అభివృద్ధి సాధించ గలుగుతున్నామని చెప్పారు.

కేంద్రంలో బీజేపీ BJP ప్రభుత్వం రాష్ట్రాల్లో అభివృద్ధి ద్వారా దేశ వికాసానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ సాధిస్తున్న పురోగతిపై చర్చ జరుగుతోందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత మార్కెట్లు అవతరించ గలిగాయన్నారు. పదేళ్లలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపంచినట్టు చెప్పారు.

తెలంగాణ రావడానికి పదేళ్ల ముందు తెలంగాణలో జరిగిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి తాము అందించిన సహకారానికి నిదర్శనం అన్నారు. రానున్న ఐదేళ్లలో మరింత పురోభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకు వెళతామన్నారు.

మోదీ మా పెద్దన్న.. సిఎం రేవంత్

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి సిఎం రేవంత్ రెడ్డిCM Revanth Reddy సాదర స్వాగతం పలికారు. జాతీయ రహదారులు, ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ప్రారంభించాల్సి ఉంటే 1600మెగావాట్లను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోందని, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళసై, సోయం బాపురావు రాష్ట్రానికి సహకరించాలని కోరారు.

విభజన హామీలో పేర్కొన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2400మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో ఎన్టీపీసీ ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 85శాతం తెలంగాణకు ఇచ్చేలా సహకరిస్తామని చెప్పారు.

కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుందని గుర్తించి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలను పిఎం దృష్టికి తీసుకెళ్లామని రేవంత్ చెప్పారు.

కేంద్రం రక్షణ శాఖ ద్వారా 190ఎకరాలను స్కై వేల నిర్మాణం కోసం రాష్ట్రానికి బదిలీ చేశారని చెప్పారు. పీయూష్ గోయల్‌ ద్వారా టెక్స్‌టైల్ యూనివర్శిటీ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలతో, కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వైఖరి తాము అనుసరించమని, రాష్ట్ర అభివృద్ధిలో వారి సహకారాన్ని తీసుకుంటామన్నారు.

ప్రధాని మోదీని తమ పెద్దన్నగా భావిస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి సంపూర్ణ సహకారం కోరుతున్నట్లు చెప్పారు. 5ట్రిలియన్ ఎకానమీని సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, మూసీ రివర్ డెవలప్మెంట్, మెట్రో రైల్ వంటి ప్రాజెక్టుల విషయంలో ప్రధాని సహకారం కోరుతున్నట్టు చెప్పారు. సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళసై, ఎంపీ సోయంబాపు తదితరులు పాల్గొన్నారు. 

IPL_Entry_Point