Ramnath Kovind | ఇవాళ ముచ్చింతల్ కు రాష్ట్రపతి రామ్ నాథ్.. పర్యటన షెడ్యూల్ ఇదే..-president of india to visit muchintal ramanujacharya temple ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  President Of India To Visit Muchintal Ramanujacharya Temple

Ramnath Kovind | ఇవాళ ముచ్చింతల్ కు రాష్ట్రపతి రామ్ నాథ్.. పర్యటన షెడ్యూల్ ఇదే..

HT Telugu Desk HT Telugu
Feb 13, 2022 08:49 AM IST

సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఇవాళ ముచ్చంతల్ రానున్నారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(ఫైల్ ఫొటో)
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(ఫైల్ ఫొటో) (Twitter)

సమతామూర్తి రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఇవాళ ముచ్చంతల్ రానున్నారు.

ట్రెండింగ్ వార్తలు

రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. శంషాబాద్ ముచ్చింతల్‌ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత.. భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. సుమారు రెండు గంటలపాటు రాష్ట్రపతి ముచ్చింతల్ లోనే ఉండనున్నారు. ఇందులో భాగంగా.. రామానుజాచార్య.. బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత.. సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందరిస్థారు.

షెడ్యూల్ ఇదే..

రాష్ట్రపతి రామ్‌నాథ్ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వస్తారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముచ్చింతల్ కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటారు. అనంతరం శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ, సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శిస్తారు.

సుమారు రెండు గంటల పర్యటనలో సహస్రాబ్ది సమారోహంలో రాష్ట్రపతి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు జీయర్ ఆశ్రమం నుంచి బయల్దేరుతారు. రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.

రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్ నగరంలో పకడ్బందీగా భద్రత్ర చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాలతో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ ఆశ్రమం వైపు ఎవరూ రావద్దని పోలీసులు కోరారు. సైబాబాద్ పోలీస్ కార్యాలయం ప్రకటన రిలీజ్ చేసింది.

IPL_Entry_Point