President Yadadri Visit: యాదాద్రి సన్నిధిలో రాష్ట్రపతి.. ప్రత్యేక పూజలు-president droupadi murmu visited yadadri temple ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  President Droupadi Murmu Visited Yadadri Temple

President Yadadri Visit: యాదాద్రి సన్నిధిలో రాష్ట్రపతి.. ప్రత్యేక పూజలు

HT Telugu Desk HT Telugu
Dec 30, 2022 01:31 PM IST

President Murmu visited Yadadri temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించుకున్నారు. మంత్రులతో పాటు ఆలయ అర్చకులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

యాదాద్రి పర్యటనలో రాష్ట్రపతి,
యాదాద్రి పర్యటనలో రాష్ట్రపతి, (twitter)

President Droupadi Murmu Telangana Tour: తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రపతి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు. ఆలయం వద్ద అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ట్రెండింగ్ వార్తలు

గర్భాలయంలో స్వయంభువు యాదాద్రీశుడిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రపతికి ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆలయ పరిసరాలను రాష్ట్రపతి పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండ కింద 3 హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. 1200 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు కొండపైకి భక్తుల వాహనాలకు అనుమతించటం లేదు. ఇప్పటివరకు నలుగురు రాష్ట్రపతులు యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం తొలిసారి రాష్ట్రపతి హోదాలో ముర్ము దర్శించుకున్నారు.

గురువారం శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సాయంత్రం 4.55 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ శ్రీరామనగరం క్షేత్రానికి చేరుకున్నారు. రాష్ట్రపతి త్రిదండి చినజీయర్‌స్వామి, పలువురు ప్రముఖులు స్వాగతం పలికారు. తొలుత ఆమె సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. చినజీయర్‌ స్వామి ఒక్కో ఆలయం విశిష్టతను రాష్ట్రపతికి వివరించారు. సాయంత్రం 5.41 గంటల సమయంలో శ్రీరామానుజాచార్యుల సువర్ణమూర్తిని దర్శించుకున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. చివరిగా లేజర్‌షోను వీక్షించిన రాష్ట్రపతి సాయంత్రం 6.35 గంటలకు తిరుగు ప్రయాణమం అయ్యారు.

WhatsApp channel