Medak News : మెదక్ జిల్లాలో కోళ్లకు కొక్కెర రోగం, పౌల్ట్రీ రైతులకు పశుసంవర్థకశాఖ కీలక సూచనలు-poultry disease outbreak in medak vet dept advises farmers on prevention ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak News : మెదక్ జిల్లాలో కోళ్లకు కొక్కెర రోగం, పౌల్ట్రీ రైతులకు పశుసంవర్థకశాఖ కీలక సూచనలు

Medak News : మెదక్ జిల్లాలో కోళ్లకు కొక్కెర రోగం, పౌల్ట్రీ రైతులకు పశుసంవర్థకశాఖ కీలక సూచనలు

HT Telugu Desk HT Telugu

Medak News : మెదక్ జిల్లా నాయిని జాలాలపురం, ఏల్లుపేటు గ్రామంలో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. దాణా, నీళ్లు అందక, కొక్కర రోగంతో కోళ్లు చనిపోతున్నట్లు పశుసంవర్థకశాఖ అధికారి తెలిపారు. వ్యాధి నిర్థారణకు కోళ్ల రక్త నమూనాలను ల్యాబ్ కు పంపించామన్నారు.

మెదక్ జిల్లాలో కోళ్లకు కొక్కెర రోగం, పౌల్ట్రీ రైతులకు పశుసంవర్థకశాఖ కీలక సూచనలు (pixabay)

Medak News : మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాలపురం గ్రామంలో, టేక్కల్ మండలం ఏల్లుపేట్ గ్రామంలో 3 రోజుల నుంచి దాణా, నీళ్లు అందక కోళ్లు మృత్యువాడపడుతున్నాయి. కోళ్లలో రోగ నిరోధక శక్తి తగ్గి, కొక్కెర రోగం, ఇతర రోగాల వలన మృతి చెందాయని ప్రాథమికంగా నిర్దారించామని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో పెద్ద ఎత్తున కోళ్లు మరణించడంతో, వాటి రక్త నమూనాలను ల్యాబ్ కు పంపించామని తెలిపారు.

రోగాలు సోకినా కోళ్లను గ్లౌజులు, మాస్కులు లేకుండా ముట్టుకోవద్దు

పౌల్ట్రీ రైతులు చేతులకు గ్లౌజులు, మాస్కులు లేకుండా చనిపోయిన కోళ్లను తాకరాదని తెలిపారు. కోళ్ల ఫార్మ్ లో పనిచేసిన తర్వాత 20 నుంచి 30 సెకన్లు పాటు చేతులను సబ్బుతో గాని శానిటైజర్ తో గానీ శుభ్రపరచుకోవాలని సూచించారు. షెడ్ చుట్టూ సున్నం, బ్లీచింగ్ పౌడర్ తరచుగా చల్లాలన్నారు. షెడ్ లోపల శానిటైజర్ ఉపయోగించాలన్నాు. హఠాత్తుగా కోళ్ల మరణాలు సంభవిస్తే జనవాస ప్రాంతాలలో గాని బహిరంగ ప్రాంతాలలో పడవేయరాదని సూచించారు. సుమారుగా 6 అడుగుల గొయ్యి తీసి సున్నం, బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలి లేదా కాల్చివేయాలని సూచించారు.

పౌల్ట్రీ షెడ్ లోకి కొత్త వ్యక్తులను అనుమతించవద్దు

షెడ్ లోపలకి కొత్త వ్యక్తులను దాణా, గుడ్లను రవాణా చేసే వాహనాన్ని అనుమతించరాదు.షెడ్ లోపల ప్రదేశాన్ని సోడియం హైపోక్లోరైడ్ లేదా పార్మాలిన్ ద్రావణంతో శుభ్రపరచుకోవాలి. గుడ్డును, చికెన్ ను 70 డిగ్రీల సెంటీగ్రేడ్ సైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించి నిరభ్యంతరంగా తినవచ్చు. అని తెలిపారు. బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ఎవియాన్ ఇన్సుఎంజా అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది వలస పక్షుల ద్వారా పక్షులకు మాత్రమే కాకుండా జంతువులకు, మనుషులకు సోకుతుంది.

బర్డ్ ఫ్లూ ద్వారా తీవ్ర శ్వాస కోశ ఇబ్బందులు

బర్డ్ ఫ్లూ పక్షులలో ప్రాణాంతక వ్యాధి. పక్షుల్లో పది రోజుల పాటు లాలాజలం, విసర్జక వ్యర్ధాల్లో వైరస్ రూపంలో ఉంటుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లలో తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, శ్వాస ఆడకపోవడం, జ్వరం, దగ్గు, కండరాల నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలతో మరణిస్తాయి. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది మనుషులకు సులభంగా వ్యాపించదు. వ్యాధి సోకిన కోళ్ల పచ్చి గుడ్డును కానీ చికెన్ కానీ తీసుకోవడం వలన వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కావున గుడ్డును, చికెన్ ను 75 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన ఉడికించడం వలన వైరస్ చనిపోతుంది. కావున అట్టి ఉష్ణోగ్రత వద్ద ఉడికించి నిరభ్యంతరంగా తినవచ్చు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం