PSTU Admissions 2024 : తెలుగు యూనివర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - ముఖ్య తేదీలివే
Telugu University Admissions: 2024-25 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.
Potti Sreeramulu Telugu University : పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు ముఖ్య తేదీలతో పాటు ప్రవేశాల నిబంధనలను పేర్కొంది.
ఈ ప్రకటనలో భాగంగా... శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషా శాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా తదితర కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా…ఆగస్టు 09, 2024 తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 19 తేదీ లోగా అప్లయ్ చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. మరిన్ని వివరాల కోసం www.pstucet.org వెబ్‌సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుంను రూ. 500గా నిర్ణయించారు.
ఓపెన్ యూనివర్శిటీలో ప్రవేశాలు..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఆగస్టు 18, 2024 వరకు గడువు విధించారు. www.braouonline.in, www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తులు ప్రారంభం - 27 -జులై-2024.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.ఆగస్టు,2024.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- అధికారిక వెబ్ సైట్ - https://www.braouonline.in/
- అప్లికేషన్ లింక్ - https://online.braou.ac.in/PG/PGFirstHome
ఆయా కోర్సులను బట్టి ఫీజులను ఖరారు చేశారు. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు. జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్‌లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చు.
డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది. ఇందులో అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ .. ఆగస్టు 18,2024 తేదీతో ముగియనుంది. ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.