TS ePASS Scholarship Updates: విద్యార్థులకు అలర్ట్... స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు - లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
TS ePASS Post-Matric Scholarship Updates: విద్యార్థులకు అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, రెన్యూవల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది.
TS ePASS Scholarship Updates: స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు విషయంలో మరోసారి గడువు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, రెన్యూవల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది. అర్హులైన విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ విద్యా సంవత్సరానికి స్కాలర్ షిప్ ల(TS ePass Scholarship 2023-24 Application Last Date)కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 19న ప్రారంభమైంది. ఈ గడువు డిసెంబర్ 31, 2023తో ముగియపోయినుంది. ఆ తర్వాత కూడా గడువు పొడిగించింది తెలంగాణ సర్కార్. జనవరి 31 వరకు అవకాశం కల్పించింది. చాలా మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోకపోవటంతో… మార్చి 31వ తేదీ వరకు గడువు పెంచింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.
కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిన విద్యార్థులు 5.50 లక్షలు ఉండగా…. ఇప్పటివరకు 4,20,262 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో లక్ష మందిపైగా అప్లయ్ చేసుకోవాల్సి ఉంది. అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/. వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఈ గడువులోపు చేసుకునే అవకాశం ఉంది.
ఇలా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు,,,,
అర్హత కల విద్యార్థులు తెలంగాణ ఈపాస్ అధికారిక వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
'Fresh Registration' అనే ఆప్షన్ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
ఇక చివరగా.. అప్లికేషన్లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "Submit" చేయాలి.
ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని.. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి.
ఇక రెన్యూవల్ విద్యార్థులు కూడా ఇదే మాదిరిగా ప్రాసెస్ చేసుకోవాలి. అయితే వారు Renewal Registration అనే ఆప్షన్‌పై నొక్కి….రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.