KTR Fire on Revanth: కేటీఆర్ న్యాయవాదుల్ని అనుమతించని పోలీసులు, ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోయిన కేటీఆర్
KTR Fire on Revanth: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణ సందర్భంగా హైడ్రామా నెలకొంది. కేటీఆర్ లీగల్ టీమ్‌ను విచారణకు పోలీసులు అనుమతించక పోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని కేటీఆర్ పట్టుబట్టారు. పట్నం నరేందర్ మాదిరి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
KTR Fire on Revanth: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు ఆయన లీగల్ టీమ్‌ను పోలీసులు అనుమతించక పోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాదుల్ని అనుమతించాలని, పోలీసులు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు అనుమతించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అరగంటకు పైగా కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వెలుపల వేచి చూశారు. అనంతరం తన వివరణతో కూడిన పత్రాలను పోలీస్ అధికారులకు అందించి వెనుదిరిగి వెళ్లిపోయారు.
నా ఇంటిపై పోలీసులు రైడ్ చేస్తారు..
అక్రమ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. విచారణకు అడ్వకేట్లను అనుమతించకపోవడం సరికాదని పట్నం నరేందర్ ఇవ్వని స్టేట్‌మెంట్లను ఇచ్చినట్టు ప్రచారం చేశారని ఆరోపించారు. తెలంగాణలో భారత రాజ్యాంగం, అంబేడ్కర్ రాజ్యాంగాలు లేవని, రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు.
తాను విచారణకు హాజరైన సమయంలో తన ఇంటిపై రైడ్ చేసి కల్పిత సాక్ష్యాలు ప్లాంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో పోలీసులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ సృష్టించిన పత్రాలు పెట్టి కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు.
తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారు..
తాను విచారణకు సహకరిస్తానని చెబుతున్నా వినకుండా, ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఊహాజనిత వార్తలు లీక్ చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చారని ప్రచారం చేశారని కేటీఆర్ ఆరోపించారు. అడ్వకేట్లను అనుమతించకపోవడం కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ఎదుట ఎదురు చూస్తున్నారు.
ఏసీబీ నమోదు చేసిన కేసులో కోర్టు తీర్పును రిజర్వు చేసిన సమయంలో విచారణకు పిలవాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను విచారణకు హాజరైన సమయంలో పోలీసులు తన ఇంటిపై దాడి చేసి కల్పిత సాక్ష్యాలను ఇంట్లో కనుగొంటారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకం ప్రకారం కథ నడిపిస్తున్నారని, ఈ కేసులో రేవంత్ రెడ్డి సాధించేది ఏమి లేదని, తమ ఇంట్లో తన ఇంట్లో తన మామ సంవత్సరీకం కార్యక్రమం జరుగుతోందని, పూజలు జరిగే సమయంలో డ్రామా సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో తన పేరు చెప్పినట్టు తప్పుడు ప్రచారం చేశారని, అలా తనకు జరగకుండా ఉండేందుకు న్యాయవాదిని అనుమతించ
తమ బంధువుల ఇంట్లో దీపావళి దావత్ జరిగితే డ్రగ్స్ దొరికాయని హడావుడి చేశారని, అసెంబ్లీలో కూడా అదే చెప్పారని, ఇప్పుడు కూడా తన విషయంలో తప్పుడు ప్రచారాలు చేసేందుకు రెడీ అయ్యారని, తాను చెప్పాలనుకున్నది లిఖిత పూర్వకంగా రాసి ఇస్తానని, అది కూడా తన లాయర్ సమక్షంలోనే ఇస్తానని చెప్పారు. తన హక్కులు తాను కాపాడుకుంటానని చెప్పారు. విచారణకు న్యాయవాదుల్ని పోలీసులు అనుమతించక పోవడంతో కేటీఆర్ విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగి వెళ్లి పోయారు.
కేటీఆర్ లేఖలో అంశాలు ఇవే…
- డిసెంబర్ 18వ తేదీన తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టులో సవాలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు
- డిసెంబర్ 31వ తేదీన తుది వాదనలు ముగిసిన ఈ అంశంలో హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసిందని కేటీఆర్ తెలియజేశారు
- ఇదే కేసులో ఏసీబీ కూడా ప్రతివాదిగా ఉన్నారని ఈ అంశంలో సుదీర్ఘమైన వాదనలను వినిపించిన ఏసీబీ అని గుర్తు చేసిన కేటీఆర్
- హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసి ఏ క్షణమైనా తీర్పును ప్రకటించే అవకాశం ఉన్న సందర్భంలో తనకు ఏసీబీ నోటీసు ఇచ్చిందన్న కేటీఆర్
- మొన్న ఏసీబీ తనకు ఇచ్చిన నోటీసులో ఈరోజు (ఆరవ తేదీన) సమాచారం అందించాలని, సమాచారంతోపాటు, డాక్యుమెంట్లను అందివ్వాలని కోరిన ఏసీబీ నోటీసులను ప్రస్తావించిన కేటీఆర్
- అయితే తనకు ఏ అంశాల పైన సమాచారం కావాలో అన్న విషయాన్ని ఏసీబీ నోటీసులో స్పష్టంగా ప్రస్తావించలేదన్న కేటీఆర్
- దీంతోపాటు ఏయే అంశాలు తాలూకు డాక్యుమెంట్లు, అడుగుతున్నారో కూడా నోటీసులో తెలపలేదన్న కేటీఆర్
సంబంధిత కథనం