Crypto Scam: ఆన్‌లైన్ సంపాదన పేరిట మోసం చేస్తున్న ఉద్యగుల అరెస్ట్-police crack down on online earning fraud multiple arrests made ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Crypto Scam: ఆన్‌లైన్ సంపాదన పేరిట మోసం చేస్తున్న ఉద్యగుల అరెస్ట్

Crypto Scam: ఆన్‌లైన్ సంపాదన పేరిట మోసం చేస్తున్న ఉద్యగుల అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Sep 02, 2024 09:45 AM IST

Crypto Scam: డిజిటల్ కరెన్సీతో అధిక లాభాలంటూ ఆశచూపి లక్షలాది రూపాయలను ముంచేసి మోసం చేసిన వారి ఆటలను నిర్మల్ పోలీసులు కట్టించేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో పెట్టుబడి పెట్టించి బురిడీ కొట్టించిన వారిని అరెస్టు చేశారు.

క్రిప్టోకరెన్సీలో లాభాలు అంటూ మోసగించిన వారిని అరెస్టు చేసిన పోలీసులు
క్రిప్టోకరెన్సీలో లాభాలు అంటూ మోసగించిన వారిని అరెస్టు చేసిన పోలీసులు

క్రిప్టోకరెన్సీ, డిజిటల్ కరెన్సీతో బాగా సంపాదించవచ్చని ఆశ పెట్టి చిరుద్యోగులు, చిరు వ్యాపారులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం నుండి ప్రారంబించి ఇలా అన్ని ప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి పని. కొన్ని రోజుల తర్వాత ఈ స్క్రిప్ట్ కాయిన్ మోసపూరితమని తెలవడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు.

ఈ విషయాని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తెలుసుకుని అవినాష్ కుమార్ ఐపీఎస్ నేతృత్వం‌లో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఈ మోసగాళ్లను వల పన్ని పట్టుకున్నారు. మొదట‌గా నవాబ్ పేట్‌కు చెందిన సల్ల రాజ్‌కుమార్‌ను విచారించగా నేరం ఒప్పుకుని అన్నీ వివరించారు.

సాయి కిరణ్, కందెల నరేష్, ఎక్సైజ్ ఎస్సై గంగాధర్, పోలీస్ కానిస్టేబుల్ మహేష్‌లను తీసుకొచ్చి విచారణ మొదలు పెట్టారు. సల్లా రాజ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. క్రిప్టోకరెన్సీ ఆన్లైన్ వ్యాపారం‌లో పెట్టుబడి పెట్టండి మీకు డాలర్ల రూపంలో లాభాలొస్తాయని, లేకుంటే మాది పూచీకత్తు అంటూ నమ్మించారు. ఏడాదిన్నర కాలంలో 5 నుండి 10 రెట్లు పెంచుకునే అవకాశం అంటూ వంచించారు. కనీస పెట్టుబడి రూ. 5,000, గరిష్ట పెట్టుబడి 10 లక్షలుగా చెప్పారు. వీటికి తోడు రెఫరల్ బోనస్ 1 శాతం అంటూ నమ్మబలికారు. ఎంత మందిని జాయిన్ చేయిస్తే అంత లాభం వస్తుందని ఆశలు చూపించి వారందరిని మభ్యపెట్టి పెట్టి ఉద్యోగస్తుల్ని మధ్య తరగతి వారితో పెట్టుబడి పెట్టించారు.

వీరు మొదటగా ఒకరిని జాయిన్ చేపించిన తర్వాత ఇంకొకరితో ఒత్తిడి తీసుక వస్తారు. మళ్లీ కొత్త వారిని జాయిన్ చేపిస్తారు. వీళ్లను సల్లా రాజ్ కుమార్ ఖాతాను సృష్టించి, ఆ తర్వాత క్రిప్టోలో ఖాతాను తెరిచేవాడు. ప్రారంభ పెట్టుబడి 500 రోజుల వరకు లాక్ చేయబడిందని, ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పేవాడు.

సి.కిరణ్, సాయికృష్ణ, నరేష్, మహేష్, గంగాధర్ వీరందరూ ఒకరి తరువాత ఒకరు వ్యాపారంలో చేరారు. తప్పుడు వాగ్దానాలతో వ్యక్తులను చేర్పించారు. ఇప్పటికైనా జిల్లా వాసులు ఇలాంటి మోసపూరితమైన పెట్టుబడులకు దూరంగా ఉండాలని, కుటుంబాలను రోడ్డల పాలు చేసుకోవద్దని, ఇలాంటివారు మళ్లీ ఎవరైనా వస్తే తమకు సమాచారం తెలపాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు.

కేసు విచారణలో చక్కటి ప్రతిభ చూపించినటువంటి ఏఎస్పీ అవినాష్ కుమార్ , డీఎస్పీ గంగారెడ్డి, నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఎస్సైలు సాయి కృష్ణ, ఎం రవి, రవీందర్, కానిస్టేబుల్ తిరుపతి , గణేష్, శోకత్, సతీష్ లను ఎస్పీ ప్రశంసించారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా