Revanth Meets Pocharam: కాంగ్రెస్‌ గూటికి మాజీ స్పీకర్ పోచారం, కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన సిఎం రేవంత్ రెడ్డి-pocharam who will join the congress fold was invited by cm revanth reddy to join the congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Meets Pocharam: కాంగ్రెస్‌ గూటికి మాజీ స్పీకర్ పోచారం, కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన సిఎం రేవంత్ రెడ్డి

Revanth Meets Pocharam: కాంగ్రెస్‌ గూటికి మాజీ స్పీకర్ పోచారం, కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన సిఎం రేవంత్ రెడ్డి

Sarath chandra.B HT Telugu

Revanth Meets Pocharam: బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి… పోచారం ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు.

సిఎం రేవంత్‌ రెడ్డికి స్వాగతం పలుకుతున్న పోచారం

Revanth Meets Pocharam: తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం గెలిచినా ఆయన పార్టీ మాత్రం ఓటమి పాలైంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.

ఈ నేపథ్యంలో శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడిని కూడా కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయన్ని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

పోచారం నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌లో చేరితే కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పోచారం మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

తెలంగాణ పున్నిర్మాణంలో భాగమన్న సిఎం..

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసినట్టు సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పెద్దలుగా ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరినట్టు చె్పారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరినట్టు ప్రకటించారు.

రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతామన్నారు. రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. భవిష్యత్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామన్నారు.

నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. ఇది రైతు రాజ్యం.. రైతు సంక్షేమ రాజ్యమని సిఎం చెప్పారు. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతామన్నారు.