PM Modi | 100 కిసాన్ డ్రోన్లు ప్రారంభం.. వ్యవసాయ రంగంలో ఇదో కొత్త అధ్యాయం
సాగులో డ్రోన్లను ఉపయోగించడం.. ఓ వినూత్న ఆరంభం అని ప్రధాని మోడీ అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం డ్రోన్ల వాడకం రక్షణ రంగానికి మాత్రమే పరిమితమైందని.. ఇప్పుడు అన్ని రంగాలకు వ్యాపించిందని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా.. కొన్ని రాష్ట్రాల్లో ఒకేసారి 100 కిసాన్ డ్రోన్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. వ్యవసాయ రంగంలో కీలక మార్పునకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ అనుబంధం పనులకు ఈ డ్రోన్లు ఉపయోగపడనున్నాయి. పంట పొలాల్లో ఎరువులు చల్లడం, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు మోసుకెళ్లడంలాంటి పనులను ఈ కిసాన్ డ్రోన్లు చేయనున్నాయి. ఇవీ రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రధాని మోడీ ఈ సందర్భంగా చెప్పారు.
యువ టాలెంట్ పై భారత్ ఎప్పుడు నమ్మకంతో ఉంటుందని.. ప్రధాని మోడీ చెప్పారు. వారి ఆలోచనలతో నవ భారత్ ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పటికే డ్రోన్లు.. మెడిసిన్, వ్యాక్సిన్లు.. లాంటి ఇతరు అవసరాలకు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈ కిసాన్ డ్రోన్లతో ఎంతో ఉపయోగమని.., ఇదో కొత్త విప్లవంగా మోడీ అభివర్ణించారు. మార్కెట్లకు రైతులు తమ ఉత్పత్తులను తక్కువ సమయంలో చేరవేసేందుకు కూడా ఇది ఉపయోగకరమని పేర్కొన్నారు. దీనికోసం అధిక సామర్థ్యం ఉన్న డ్రోన్లను ఉపయోగించుకుంటారని మోడీ అన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు డ్రోన్లు అంటే కేవలం ఢిపెన్స్ కు మాత్రమే పరిమితంగా ఉండేవి. ఇతర రంగాల్లోనూ ఇప్పుడు వీటి వాడకం పెరిగింది. 200లకు పైగా డ్రోన్ స్టార్టప్‌లు ఉన్నాయి. అయితే వీటి సంఖ్య వెయ్యికి పైగా పెంచేలా ప్రణాళికలు చేస్తున్నాం. దీంతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
- ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని మోడీ ఇంకా ఏం మాట్లాడారంటే...
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. 21వ శతాబ్దపు ఆధునిక వ్యవసాయంలో ఇదో కొత్త అధ్యాయం. డ్రోన్ల వాడటం రైతులకు ఎంతో ఉపయోగకరం. 2022-23 బడ్జెట్‌లో దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేసే బడ్జెట్ కేటాయించారు. దేశ వ్యాప్తంగా రైతులకు డిజిటల్, హైటెక్ టెక్నాలజీని అందించడానికి కేంద్రం కిసాన్ డ్రోన్లు, ఆర్గానిక్ వ్యవసాయం, ఇతర ప్రోత్సహాకాలు అందిస్తామని ఆమె చెప్పారు. అందులో భాగంగానే.. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగుమందులు, పోషకాలను పిచికారీ కోసం కిసాన్ డ్రోన్లను ప్రోత్సహిస్తున్నాం.