Hyd First Flight Restaurant: నగరంలో తొలి ఫ్లైట్ రెస్టారెంట్.. ఓపెనింగ్ ఎప్పుడంటే-pista house to launch hyderabad first flight restaurant in december 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Pista House To Launch Hyderabad First Flight Restaurant In December 2022

Hyd First Flight Restaurant: నగరంలో తొలి ఫ్లైట్ రెస్టారెంట్.. ఓపెనింగ్ ఎప్పుడంటే

Mahendra Maheshwaram HT Telugu
Nov 27, 2022 10:19 AM IST

Hyderabad’s first flight restaurant: చాలా రకాల థీమ్ లతో రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తుండడం గత కొంత కాలంగా బాగా ట్రెండ్ అయిపోయింది. కొత్త కొత్త ఆలోచనలతో భోజనప్రియులను ఆకర్షించేస్తున్నారు. జైలులో భోజనం, ట్రైన్ థీమ్ తో రెస్టారెంట్ చూశాం. తాజాగా హైదరాబాద్‌ నగరంలో ఫ్లైట్ రెస్టారెంట్ రాబోతుంది. ఓపెనింగ్ డేట్ కూడా వచ్చేసింది...

హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న ఫ్లైట్ రెస్టారెంట్‌
హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న ఫ్లైట్ రెస్టారెంట్‌ (twitter)

Flight Restaurant in Hyderabad: నైట్ డిన్నర్ కు వెళ్దామా..? ఎక్కడైతే బాగుంటుంది..? ట్రైన్ రెస్టారెంట్ కు వెళ్దామా..? జైల్ రెస్టారెంట్ లో భోజనం చేద్దామా..? ఇలా ప్రతిరోజూ వేలాది మంది బయటికి వెళ్తూనే ఉంటారు. లంచ్ లేదా డిన్నర్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఇక హైదరాబాద్ లో చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల థీమ్ లతో ఆహార ప్రియులను ఆకట్టుకునేలా పలు రెస్టారెంట్లు నడుస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా పిస్తా హౌస్ రెస్టారెంట్ వాళ్లు... సరికొత్త అనుభూతిని కల్పించబోతున్నారు. హైదరాబాద్ వేదికగా ఫ్లైట్ రెస్టారెంట్‌ని మరికొద్దిరోజుల్లోనే ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

నగర శివారులోని శామీర్ పేట్ ప్రాంతంలో ఈ ఫ్లైట్ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నారు. దీనికోసం ఎయి ర్ ఇండియా సంస్థ నుంచి మొట్టమొదటి ఎయిర్ బస్ - 320 పాత విమానాన్ని కొనేసింది పిస్తా హౌస్ రెస్టారెంట్. ఇందుకు 75 లక్షలకు పైగా ఖర్చు చేశారు. దీన్ని హైదరాబాద్ కు కూడా తీసుకొచ్చారు. జంటనగరాల ప్రజలకు బ్రాండ్ నేమ్‌తో ఉన్న బిర్యానీతో పాటు ఫ్లైట్‌ అనుభూతిని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్ల కోసం మరో 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేస్తున్నారు.

డిసెంబర్ లో ఓపెనింగ్…!

ఇందులో 150మంది సిట్టింగ్ కెపాసిటీకి తగినట్లుగా రెస్టారెంట్‌గా మార్చుతోంది. కస్టమర్లు కూర్చొని డిన్నర్, లంచ్ చేసే విధంగా ఈ ఎయిర్‌ బస్‌ని డిజైన్ చేస్తున్నారు. ఫ్లైట్‌ జర్నీ ఫీలింగ్ మిస్ కాకుండా ఈ రెస్టారెంట్‌ని డిజైన్ చేయడంతో పాటుగా రన్‌ వే, సెక్యురిటీ చెక్, బోర్డింగ్ పాస్ స్టైల్లోనే టికెట్‌ల కొనుగోలు వంటి వాటిని ఏర్పాటు చేసింది. ఇందులో వెజ్, నాన్ వెజ్ తో పాటు ఇతర వెరైటీలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫ్లైట్ రెస్టారెంట్... డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా నిర్వాహకులు ముందుకెళ్తున్నారు.

దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా పిస్తా హౌస్‌ కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతానికి హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 32బ్రాంచీలను ఏర్పాటు చేసింది. మొదటి బ్రాంచ్‌ని శాలిబండలో 1997ప్రారంభించారు. అక్కడి నుంచి పిస్తా హౌస్ వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తూ దుబాయ్, సౌదీ అరేబియా, మలేషియా, సింగపూర్‌ లాంటి విదేశాల్లో కూడా విస్తరించింది. ముఖ్యంగా పిస్తా హౌస్‌ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది హలీమ్. పిస్తా తయారు చేసే హలీమ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.

IPL_Entry_Point