TS PGECET 2024 : తెలంగాణ పీజీఈసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు - కొత్త తేదీలివే-pgecet 2024 exam postponed in telangana check new exam dates are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Pgecet 2024 : తెలంగాణ పీజీఈసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు - కొత్త తేదీలివే

TS PGECET 2024 : తెలంగాణ పీజీఈసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు - కొత్త తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Published May 18, 2024 05:31 AM IST

TS PGECET-2024 Updates : తెలంగాణలో TS PGECET - 2024 పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదలైంది. పరీక్షల నిర్వహణకు కొత్త తేదీలను ప్రకటించారు.

TS PGECET-2024 పరీక్ష వాయిదా
TS PGECET-2024 పరీక్ష వాయిదా

TS PGECET 2024 Updates : తెలంగాణలో పీజీఈసెట్‌ -2024 పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో PGECET రాత ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు కన్వీన‌ర్ డాక్ట‌ర్ ఏ అరుణ కుమారి వెల్ల‌డించారు.

కొత్త తేదీలివే

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం….  పీజీఈసెట్‌ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.  జూన్  9వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తి కావాలి. కానీ స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ ప‌రీక్ష‌లు, టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు.  తెలంగాణ పీజీఈసెట్ రాత‌ ప‌రీక్ష‌ల‌ను జూన్ 10 నుంచి ప్రారంభించనున్నారు. జూన్ 13వ తేదీతో పూర్తి కానున్నాయి.

ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పీజీఈసెట్‌(TS PGECET 2024 ) ను నిర్వహిస్తున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, , ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.  https://pgecet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

  • ప్రవేశ పరీక్ష - టీఎస్‌పీజీఈసెట్ 2024(TS PGECET 22024)
  • పరీక్ష నిర్వహించే వర్శిటీ -జేఎన్‌టీయూ, హైదరాబాద్
  • కోర్సులు - ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డి
  • అర్హతలు - అభ్యర్థులు బీఈ/బీటెక్/బీఆర్క్/ బీప్లానింగ్/బీఫార్మసీ, ఎంఏ/ఎంఎస్సీ (సోషియాలజీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ) ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తిస్థాయి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
  • దరఖాస్తులు - ఆన్ లైన్
  • రూ.2500 ఆల‌స్య రుసుముతో అప్లికేషన్లకు తుది గడువు - 21-మే-2024.
  • రూ.5000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తులకు చివరితేదీ - 25-మే-2024.
  • హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌: 28 మే 2024.
  • పరీక్షలు ప్రారంభం - జూన్ 10, 2024.
  • పరీక్షలు పూర్తి అయ్యే తేదీ - జూన్ 13, 2024.
  • అధికారిక వెబ్ సైట్ - https://pgecet.tsche.ac.in/ 
  • దరఖాస్తు లింక్ - https://pgecet.tsche.ac.in/PGECET_HomePage.aspx 

 

Whats_app_banner