BRS Protest: నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ, హైకోర్టులో పిటిషన్‌-permission denied for brs led farmers mega dharna in nalgonda ktr files petition in high court ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Protest: నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ, హైకోర్టులో పిటిషన్‌

BRS Protest: నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ, హైకోర్టులో పిటిషన్‌

HT Telugu Desk HT Telugu

BRS Protest: తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు చేపడుతోందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో తలపెట్టిన రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరించారని ఆ పార్టీ నాయకత్వం మండిపడుతోంది.

బీఆర్‌ఎస్‌ ఆందోళనలకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం

BRS Protest: రైతుల పక్షాన పోరాడుతున్నందుకు ఎందుకిన్ని ఆంక్షలు పెడుతున్నారని, ప్రజా పాలనలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు లేదా అని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించారు. రైతు మహా ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనాల్సి ఉంది. ‘‘ తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. పరిపాలన చేయడం చేతకాక నిరసనలు వ్యక్తం చేస్తామంటే అనుమతి నిరాకరిస్తున్నారు..’’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మామీలు ముఖ్యంగా.. రైతుల కోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ అంటోంది. రైతులను మోసం చేసినందుకు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతోందని, దీనిలో భాగంగానే మంగళవారం నల్గొండలో దీక్షా సభ నిర్వహించాలని ఆ పార్టీ చెబుతోంది. అయే, జిల్లా పోలీసులు దీక్షకు అనుమతి నిరాకరించారు. రైతు భరోసా చెల్లించడంలో ప్రభుత్వం రైతులకు బాకీ పడిందని, కృష్ణా గోదావరిలో నీళ్లు ఉన్నా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటూ ఆరోపిస్తోంది. ‘ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎంతగా అడ్డుకున్నా మంగళవారం నాటి దీక్ష కొనసాగుతుంది. ఇది మా హక్కు..’’ అని.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.

కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసులు..?

దీక్షకు మొదట పర్మిషన్ ఇస్తామని చెప్పి తీరా సోమవారం అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు చెబుతున్నారని, జిల్లా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు రోపిస్తున్నారు. ‘‘ ప్రజాస్వామ్య యుతంగా ధర్నా చేస్తాం అంటే కూడా సహించలేని పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తలల్లాగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం ధర్నా నిర్వహించి తీరుతం.. ’’ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రకటించా

నల్గొండ లో రైతు మహా ధర్నాలకు అనమతి ఇచ్చేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టాలని నిర్ణయించుకుంది. కోర్టు నుంచి తమకు అనుమతి లభిస్తుందని భావిస్తున్న బీఆర్ఎస్ నాయకలు జిల్లాలోని రైతులు వేలాదిగా నల్గొండకు తరలి రావాలని కూడా పిలుపు ఇచ్చారు. ‘‘ ఎట్టి పరిస్థితుల్లో ధర్నా నిర్వహించి తీరుతాం నల్గొండ దద్దరిలేలాగా ధర్నా ఉంటుంది.

ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా బీఆర్ఎస్ రైతుల తరఫున పోరాటం చేస్తుంది. మంగళవారం కేటీఆర్ నల్గొండకు వస్తారు. ధర్నాలో పాల్గొంటారు. పోలీసులు ప్రజాస్వామ్యయితంగా, చట్టబద్ధంగా నడుచుకోవాలి.. ’’ అని నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మీడియాకు చెప్పారు.

( రిపోర్టింగ్: క్రాంతీపద్మ, హిందస్తాన్ టైమ్స్ నల్గొండ కరస్పాండెంట్ )