Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి-peddapalli workers carrying tractor overturned three women dead four injured ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

HT Telugu Desk HT Telugu
May 05, 2024 09:48 PM IST

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాల్లో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. కూలిపనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది.

ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం(Peddapalli Tractor Accident) జరిగింది.‌‌ సుల్తానాబాద్ మండలం మియాపూర్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురు మహిళా కూలీలు(Women Wokers) మృతి చెందారు.‌ మరో నలుగురు గాయపడ్డారు. చిన్నబొంకూరు గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు మియాపూర్ లో మొక్కజొన్న కంకుల పొట్టుతీత కూలీ పనికి వెళ్లారు. పని ముగించుకుని కంకుల లోడు ట్రాక్టర్ లో తిరిగి ఇంటికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా (Tractor Overturned)పడింది.‌ ముగ్గురు మహిళలు పోచంపల్లి రాజమ్మ(61), మల్యాల వైష్ణవి (35), బేతి లక్ష్మి (50) అక్కడికక్కడే మృతిచెందారు.‌ పోచంపల్లి పద్మ, లక్ష్మి, విజ్జగిరి రమ, రాజమ్మ, ట్రాక్టర్ డ్రైవర్ మల్యాల వెంకటేష్ గాయపడ్డారు. వారిని స్థానికులు సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు అంతా ఒకే గ్రామం చిన్నబొంకూర్ కు చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

భార్య మృతి... భర్తకు గాయాలు

ట్రాక్టర్ బోల్తాపడ్డ ప్రమాదం(Tractor Accident)లో మల్యాల వైష్ణవి ప్రాణాలు కోల్పోగా ఆమె భర్త వెంకటేష్ ట్రాక్టర్ డ్రైవర్ గాయపడ్డారు. కూలి పనికి వెళ్లి క్షేమంగా తిరిగి వస్తారనుకున్న తల్లి ప్రాణాలు కోల్పోగా, తండ్రి గాయాలై ఆసుపత్రిపాలు కావడంతో వారి ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.‌ నాన్నా.. అమ్మకు ఏమైందని ఆరా తీస్తూ కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరుల హృదయాలను కలచివేసింది. ట్రాక్టర్ పై వెంకటేష్ కూలీలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడిందని స్థానికులు తెలిపారు.

రెక్కాడితేగాని..దొక్కనిండని కుటుంబాలు

ట్రాక్టర్ బోల్తా(Tractor Overturned) ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురూ నిరుపేద కూలీలు. రెక్కాడితే గానీ దొక్కనిండని కుటుంబాలు కావడంతో మండే ఎండలను సైతం లెక్కచేయకుండా కూలీ(Daily Wage Earners) పనికి వెళ్లారు. ట్రాక్టర్ ప్రమాదంతో ముగ్గురు మహిళలు తిరిగిరాని లోకానికి వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుల కుటుంబాలను, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పెద్దపల్లి(Peddapalli) ఎమ్మెల్యే విజయరామారావు పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయం అందజేసి, గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.‌

HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar

Whats_app_banner

సంబంధిత కథనం