Passport Adalat 2024 : మీ పాస్‌పోర్టు అప్లికేషన్ పెండింగ్ లో ఉందా..? ఈ స్పెషల్ డ్రైవ్ మీకోసమే-passport adalat will be held on january 20 on the premises of the regional passport office in secunderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Passport Adalat 2024 : మీ పాస్‌పోర్టు అప్లికేషన్ పెండింగ్ లో ఉందా..? ఈ స్పెషల్ డ్రైవ్ మీకోసమే

Passport Adalat 2024 : మీ పాస్‌పోర్టు అప్లికేషన్ పెండింగ్ లో ఉందా..? ఈ స్పెషల్ డ్రైవ్ మీకోసమే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 18, 2024 03:10 PM IST

Passport Adalat in Hyderabad : పాస్ పోర్టుల జారీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం.పెండింగ్‌లో ఉన్న వాటికి పరిష్కారం చూపే దిశగా జనవరి 20వ తేదీన ‘పాస్‌పోర్టు అదాలత్‌’ నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదలైంది.

పాస్ పోర్టు అదాలత్
పాస్ పోర్టు అదాలత్ (https://www.passportindia.gov.in/)

Passport Adalat in Hyderabad : పాస్‌పోర్టు పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టింది హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం. ఇందుకోసం ప్రత్యేకంగా 'పాస్ పోర్టు ఆదాలత్' ను చేపట్టాలని నిర్ణయించింది. దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నవారు సత్వర పాస్‌పోర్టు మంజూరు కోసం ఈ అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్య వివరాలను ప్రకటించింది.

జనవరి 20న ‘పాస్‌పోర్టు అదాలత్‌’

ఈ నెల 20వ తేదీన ‘పాస్‌పోర్టు అదాలత్‌’ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి(ఆర్పీవో) జొన్నలగడ్డ స్నేహజ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఈ అదాలత్‌ ఉంటుందని వివరించారు.

పాస్ పోర్టు ఆదాలత్ కోసం వచ్చే దరఖాస్తుదారులు... ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకురావాల్సి ఉంటుందని ఆర్పీవో స్నేహజ పేర్కొన్నారు. సెల్ఫ్‌ అటెస్టెడ్‌ డాక్యుమెంట్స్ కూడా తీసుకురావాలని తెలిపారు. వాక్‌ ఇన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించి... సత్వరమే పరిష్కరించనున్నట్లు వివరించారు. https://www.passportindia.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయాన్ని rpo.hyderabad@mea.gov.in మెయిల్ ద్వారా లేదా 91-40-27715333,91-40-27715115 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

ఇక పాస్ పోర్ట్ జారీలో దేశంలోనే సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఐదవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దేశంలోని మొత్తం 37 పాస్ పోర్ట్ ప్రాంతీయ కార్యాలయాల్లో మొదటి నాలుగు స్థానంలో ముంబై,బెంగళూరు,లక్నో,చండీగఢ్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే సికింద్రాబాద్ లోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం… గత ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు ఎనిమిది లక్షల వరకు పాస్ట్ పోర్టు లను జారీ చేసింది. గతంలో పోల్చితే 2023 ఏడాదిలో లక్షా 40వేలకు పైగా పాస్ పోర్టులన అత్యధికంగా జారీ చేశారు. పాస్ పోర్టు లు తాత్ కల్ విధానంలో జారీ చేసేందుకు కనీసం 4 నుంచి 5 రోజులు సమయం పడుతుందని అధికారులు చెప్పగా… సాధారణ పాస్ పోర్ట్ లు జారీ చేయడానికి దాదాపు 22 రోజుల సమయం పడుతున్నట్టు ప్రకటించారు.

Whats_app_banner