మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 86 ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే-ordnance factory medak has invited applications for jr manager assistant and other posts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 86 ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే

మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 86 ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 20, 2024 07:14 PM IST

Ordnance Factory Medak Jobs 2024 : మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జూనియర్ మేనేజర్ సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు
మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు

మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జూనియర్ మేనేజర్ సహా పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి https://ddpdoo.gov.in/units/OFPM అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ 30 నవంబర్ 2024. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఇందులో అత్యధికంగా 56 జూనియర్‌ మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి. మెకానికల్, ప్రొడక్షన్, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రికల్, బిజినెస్‌ అనలిటిక్స్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిప్లొమా టెక్నీషియన్‌ 21 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్‌ పోస్టులు 11, జూనియర్‌ అసిస్టెంట్‌ నాలుగు ఉద్యోగాలున్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రూ. 300 ఫీజు చెల్లించాలి. మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపిక చేస్తారు. వీరిని మాత్రమే…. ఇంటర్వ్యూకి పిలుస్తారు.ఎంపికైన జూనియర్‌ మేనేజర్‌కు నెలకు రూ.30,000 చెల్లిస్తారు. డిప్లొమా టెక్నీషియన్‌కు రూ.23,000, అసిస్టెంట్‌కు రూ.23,000 ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30వ తేదీ గడువుగా ఉంది.

హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌ నుంచి నోటిఫికేషన్ :

హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://www.nfc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ , మోటార్ మెకానిక్స్(వెహికల్‌), డ్రాఫ్ట్స్‌మ్యాన్, సీఓపీఏ, డీజిల్‌ మెకానిక్, కార్పెంటర్‌, ప్లంబర్‌, అటెండెంట్ ఆపరేటర్/ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్, వెల్డర్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్) విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండకూడదు.

ఎంపికైన వారికి నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 స్టైఫండ్ అందుతుంది. విద్యార్హతలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారని నోటిఫికేషన్ తెలిపారు.

అప్లికేషన్ అసంపూర్ణంగా ఉంటే తిరస్కరణకు గరువుతుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. Trade Electrician ఖాళీల భర్తీకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైన తర్వాత అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. వీటి వివరాలను కూడా పేర్కొన్నారు.

  1. పదో తరగతి మార్కుల మెమో
  2. ఐటీఐ ఉత్తీర్ణత సర్టిఫికెట్
  3. కుల ధ్రువీకరణపత్రం
  4. ఆధార్ కార్డు
  5. పోలీస్ వెరిఫికేషన్ ధ్రువపత్రం ఉండాలి.
  6. అకౌంట్ బ్యాంక్ బుక్
  7. అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీ
  8. ఫొటోలు

Whats_app_banner

సంబంధిత కథనం