Terror Conspiracy: ఉగ్రమూకల కదలికలు.. హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తి అరెస్ట్!-one more arrested by mp police in hyderabad terror case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Terror Conspiracy: ఉగ్రమూకల కదలికలు.. హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తి అరెస్ట్!

Terror Conspiracy: ఉగ్రమూకల కదలికలు.. హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తి అరెస్ట్!

HT Telugu Desk HT Telugu
Published May 10, 2023 05:45 PM IST

Hyderabad Terror Conspiracy Case Updates: హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన ఉగ్ర మూకల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరొకరిని అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు.

హైదరాబాద్ ఉగ్ర మూకల కేసులో మరో అరెస్ట్
హైదరాబాద్ ఉగ్ర మూకల కేసులో మరో అరెస్ట్ (unspalsh)

Hyderabad Terror Conspiracy Case: హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో 16 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 11 మంది భోపాల్ కు చెందిన వారు కాగా, హైదరాబాద్ కు చెందిన 5గురు ఉన్నారని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెల్లడించింది. అరెస్టైన వారి నుంచి ఇస్లామిక్ జిహాదీ బుక్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కత్తులు ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. జవహర్ నగర్‌ పరిధి బాలాజీ నగర్‌కు చెందిన మహమ్మద్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది.

చాలా రోజులుగా నిఘా...

ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన కేంద్ర వర్గాలు స్థానిక పోలీసుల సమాచారంతో దాడులు నిర్వహించారు. 18 నెలలుగా రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా నిఘా సంస్థలు గుర్తించాయి. నిందితులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అరెస్టు చేసిన వారితో సంబంధాలు కలిగి ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరంతా ఉగ్రవాద సంస్థల వ్యవహారాలకు ఆకర్షితులై ఆయా సంస్థల్లో చేరాలనే ఉద్దేశంతో గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పోలీసులు అనుమనిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్‌ నుంచి కొంత మంది సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. కొంత మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ వంటి నిఘా సంస్థలు పట్టుకున్నాయి.

అరెస్టైన్ నిందితుల నుంచి ఎలక్ట్రానిక్ డివైన్స్, డ్రాగర్స్, మొబైల్స్, ఇస్లామిక్ జీహాది సాహిత్యం, కత్తులను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు వీరంతా ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా ఐసిస్ సానుభూతిపరులతో వీరంతా టచ్ లో ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే భోపాల్, హైదరాబాద్ లో మకాం వేసినట్లు నిఘా సంస్థలు పసిగట్టాయి. ఈ విషయంపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ పాతబస్తీలో గత ఏడాదే ఐసిస్ అనుభూతిపరుడు అరెస్టై్య్యాడు. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు గత ఏడాది ఏప్రిల్ లో అరెస్ట్ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సులేమాన్ అనేవ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అతడి ఐపీ అడ్రస్ అడ్రస్ లొకేట్ చేసి మీర్ చౌక్ పోలీసుస్టేషన్ పరిధిలో సులేమాన్ ను అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామాలతో ఒక్కసారిగా మరోసారి ఉగ్ర మూకల అంశం హాట్ టాపిక్ గా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం