Kamareddy Boys Killed: చెరువులో దిగి ఒక బాలుడు, కాపాడే ప్రయత్నంలో మరో బాలుడి మృతి-one boy fell into the pond and another boy died while trying to save him ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  One Boy Fell Into The Pond And Another Boy Died While Trying To Save Him

Kamareddy Boys Killed: చెరువులో దిగి ఒక బాలుడు, కాపాడే ప్రయత్నంలో మరో బాలుడి మృతి

HT Telugu Desk HT Telugu
Feb 25, 2024 07:35 AM IST

Kamareddy Boys Killed: కామారెడ్డిలో ప్రమాదవశాత్తూ ఇద్దరు బాలలు చెరువులో మునిగిపోయారు. ఒకరు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయత్నించిన బాలుడు కూడా మునిగిపోయాడు.

బాలలు చెరువులో మునిగిపోయిన ప్రాంతం
బాలలు చెరువులో మునిగిపోయిన ప్రాంతం

Kamareddy Boys Killed: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. చెరువుల దిగి ఒక‌రు, కాపాడ‌బోయి మ‌రొక‌రు ఇద్ద‌రు చిన్నారులు దుర్మ‌ర‌ణం చెందారు. ఒకే ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు చిన్నారులు మ‌ర‌ణించ‌డంతో త‌ల్లీదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఇద్దరు నీట మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

గ్రామంలో విషాద‌చాయ‌లు నెల‌కొన్నాయి. ఘ‌ట‌న‌కు సంబంధించి గ్రామ‌స్త‌లు, బాధితుల క‌థ‌నం ప్ర‌కారం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండ‌లం ముదేల్లి గ్రామానికి చెందిన మిద్దెల ర‌వీంద‌ర్‌(9), సుతారి శ‌శాంక్‌(9) బంధువుల శుభాకార్యానికి హాజ‌ర‌య్యేందుకు బాన్సువాడ వెళ్లారు.

తిరిగి వ‌చ్చే స‌మ‌యానికి ఆల‌స్య‌మ‌వ‌డంతో పాఠ‌శాల‌కు వెళ్ల‌కుండా ఇంటి ద‌గ్గ‌రే ఆడుకుంటున్నారు. అయితే మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో ర‌వీంద‌ర్‌, శ‌శాంత్‌తో పాటు ర‌వీంద‌ర్ చెల్లెలు మ‌నీషా టైర్ ఆట ఆడుకుంటూ ఊరిలోని పెద్ద చెరువు వైపు వెళ్లారు.

ఆ స‌మ‌యంలో ర‌వీంద‌ర్ కాల‌కృత్యాల‌కు వెళ్లి క‌డుక్కోవ‌డానికి చెరువు వ‌ద్ద‌కు వెళ్లాడు. అయితే ప్ర‌మాద‌వ‌శాత్తు చెరువులో ప‌డి మునిగాడు. ఇది గ‌మ‌నించిన శ‌శాంక్.. ర‌వీంద‌ర్‌ను కాపాడేందుకు చెరువులో దూకాడు. కానీ శ‌శాంక్ సైతం మునిగిపోయాడు.

చెరువు గ‌ట్టుపై ఉన్న మ‌నీషా రోదిస్తూ వెళ్లి జ‌రిగిన ఘ‌ట‌న‌ను కుటుంబ స‌భ్యుల‌కు, గ్రామ‌స్తుల‌కు తెలియ‌జేసింది. కానీ కుటుంబీకులు, గ్రామ‌స్తులు చేరుకునే స‌రికి ఇద్ద‌రు నీటిలో తేలారు. ఇద్ద‌రి మృత‌దేహాల‌ను చెరువు నుండి బ‌య‌ట‌కు తీశారు. మిద్దెల రవీందర్ తండ్రి మిద్దెల రాజు ఫిర్యాదు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp channel