NTR Trust Scholarship 2025 : ఎన్టీఆర్ ట్రస్ట్ మెరిట్ స్కాలర్‌షిప్.. నెలకు రూ.5 వేలు పొందే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి
NTR Trust Scholarship 2025 : ప్రతిభ ఉన్న విద్యార్థినులను ఎన్టీఆర్ ట్రస్టు ప్రోత్సహిస్తోంది. ఎన్టీఆర్ జీఈఎస్టీ స్కాలర్‌షిప్ టెస్టు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. https://ntrcollegeforwomen.education/ntr-gest-scholarship-inter/ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ జీఈఎస్టీ స్కాలర్‌షిప్ టెస్టు 2025 కు సంబంధించి.. మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటన విడుదల చేశారు. 2025 ఏడాదికి సంబంధించిన ఎన్టీఆర్ జీఈఎస్టీ స్కాలర్‌షిప్ టెస్టును డిసెంబర్ 8న నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ టెస్టులో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యా సంస్థల ద్వారా స్కాలర్‌షిప్ అందజేయనున్నట్టు వివరించారు.
మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు నెలకు రూ. 5 వేల చొప్పున, తర్వాతి 15 ర్యాంకులు పొందిన వారికి నెలకు రూ.3 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందించనున్నారు. ఎన్టీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసే వరకు ఉపకారవేతనం అందిస్తారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న బాలికలు దీనికి అర్హులు.
ముఖ్య వివరాలు..
నోటిఫికేషన్ విడుదల - 15-11-2024
దరఖాస్తుల స్వీకరణ- 16-11-2024 నుంచి 04-12-2024 వరకు
వెబ్‌సైట్- https://ntrcollegeforwomen.education/ntr-gest-scholarship-inter/
టెస్టు- గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్టు
పరీక్ష తేదీ- డిసెంబర్ 8
అర్హత- ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు
ఫోన్ నంబర్- పూర్తి వివరాలకు 7660002627, 7660002628 నంబర్లకు ఫోనే చేయొచ్చు.
గత పది సంవత్సరాలుగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో బాలికలకు స్కాలర్ షిప్‌లు అందిస్తున్నారు. జీఈఎస్టీ టెస్టు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. మొత్తం మార్కులు ఉంటాయి. 60 మార్కులు వచ్చిన వారిని అర్హులుగా ప్రకటిస్తారు. పరీక్ష 2 గంటలు ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జీకే, రీజనింగ్‌కు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు.
మోయినాబాద్ మండలం, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్‌లో ఉన్న ఎన్టీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో పరీక్ష ఉంటుంది. డిసెంబర్ 8 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు వచ్చేవారు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఎగ్జామ్ ప్యాడ్, స్కూల్ ఐడీ కార్డు, మాస్క్, శానిటైజర్ తీసుకొని వెళ్లాలి.