BVSC NRI, Self Finance: తెలంగాణలో బీవీఎస్సీలో ఎన్నారై, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాకు అనుమతి-nri self finance quota in bvsc in telangana allowed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bvsc Nri, Self Finance: తెలంగాణలో బీవీఎస్సీలో ఎన్నారై, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాకు అనుమతి

BVSC NRI, Self Finance: తెలంగాణలో బీవీఎస్సీలో ఎన్నారై, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాకు అనుమతి

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 21, 2024 01:52 PM IST

BVSC NRI, Self Finance: తెలంగాణ బీవీఎస్సీ కోర్సుల్లో ఎన్నారై, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాలను అనుమతించాలని పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పాలకమండలి నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరంలోనే రెండు కాలేజీల్లో 10సీట్లలో ఈ కోటాలను అనుమతిస్తారు.

పీవీ నరసంహరావు వెటర్నరీయూనివర్శిటీలో సెల్ఫ్‌ ఫైనాన్స్, ఎన్నారై సీట్లు
పీవీ నరసంహరావు వెటర్నరీయూనివర్శిటీలో సెల్ఫ్‌ ఫైనాన్స్, ఎన్నారై సీట్లు

BVSC NRI, Self Finance: తెలంగాణలో బ్యాచిలర్‌ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్‌ కోర్సుల్లో ఎన్నారై, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాలను అనుమతిస్తూ పీవీ నరసింహారావు తెలం గాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం పాలకమండలి తీర్మానం చేసింది. ఈ ఏడాది నుంచి బీవీఎస్సీ కోర్సుల్లో ఎన్నారై, సెల్ఫ్‌ ఫైనాన్స్ కోటాలను ప్రారంభించాలని పాలకమండలి నిర్ణయిం చింది.

yearly horoscope entry point

2024-25విద్యా సంవత్సరంలో తెలంగాణలోని రెండు వెటర్నరీ కళాశాలల్లో 10 సీట్లను ఈ కోటాలో భర్తీ చేస్తారు. ఈ మేరకు ఎన్నారై, సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోటా అడ్మిషన్లకు ఆది వారం నోటిఫికేషన్ విడుదలైంది.

పీవీ నరసింహరావు వెటర్నరీ విశ్వవిద్యాలయ పరిధిలోని రాజేంద్రనగర్, కోరుట్ల కళాశాలల్లో ఐదేసి సీట్లను ఈ కోటాలో భర్తీ చేస్తారు. ఒక్కో కాలేజీలో 3 ఎన్ఆర్ఐ, 2 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా కింద మొత్తం 10 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో ఎన్నారై, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్ని తొలిసారి ప్రవేశపెడుతున్నారు. యూనివర్శిటీ ఆర్థిక వనరులను పెంచుకునేందుకు వీలుగా ఎన్ఆర్ఐ, సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను ప్రవేశపెడుతున్నారు.

ప్రవాస భార తీయ కుటుంబాల పిల్లలు, ప్రవాస భారతీయులు స్పాన్స ర్‌ చేసే వారికి ఈ కోటా కింద సీట్లు ఇస్తారు. తెలం గాణతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విభాగంలో సీట్లను దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్లు పొందినవారు రూ. 20 లక్షల ప్రవేశ రుసుముతో పాటు సంవత్సరానికి రూ.6 లక్షలు చొప్పున ఐదేళ్లకు రూ.30 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

నీట్ ర్యాంకుల ఆధారంగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా సీట్లను భర్తీచేస్తారు. ఎన్ఆర్‌ఐ కోటాలో సీట్లు భర్తీకాకపోతే వాటిని కూడా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విభాగంలోకి బదలాయిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నవంబర్‌ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుచేసుకున్న వారికి నవంబర్ 18న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ఎన్నారై, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విభాగాల్లో దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించండి… https://tsvu.nic.in/home.aspx

Whats_app_banner