London BRS: లండన్ టవర్ బ్రిడ్జి దగ్గర ఎన్నారై బీఆర్ఎస్-యూకే నిరసన, కాంగ్రెస్‌ వైఫల్యాలపై ఆందోళన-nri brs uk protest near londons tower bridge expressing concern over congress failures ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  London Brs: లండన్ టవర్ బ్రిడ్జి దగ్గర ఎన్నారై బీఆర్ఎస్-యూకే నిరసన, కాంగ్రెస్‌ వైఫల్యాలపై ఆందోళన

London BRS: లండన్ టవర్ బ్రిడ్జి దగ్గర ఎన్నారై బీఆర్ఎస్-యూకే నిరసన, కాంగ్రెస్‌ వైఫల్యాలపై ఆందోళన

HT Telugu Desk HT Telugu
Jan 30, 2025 06:07 PM IST

London BRS: కాంగ్రెస్‌ వైఫల్యాలపై ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులవుతున్నా ఇచ్చిన 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపిస్తూ ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లండన్ లో నిరసన తెలిపారు.

కాంగ్రెస్‌ హామీలపై లండన్‌లో బీఆర్‌ఎస్ నిరసనలు
కాంగ్రెస్‌ హామీలపై లండన్‌లో బీఆర్‌ఎస్ నిరసనలు

London BRS: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అయ్యినా 2023 ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చక పోవడం కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు. 420 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందనీ, అంతే కాకుండా ప్రశ్నించిన ప్రతి పక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ, రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగించడం, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఇలా రాష్ట్రాన్ని మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారన్నారు.

yearly horoscope entry point

ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి…

కేటీఆర్‌ పిలుపు మేరకు ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ఉపాధ్యక్షుడు రవి కుమార్ రేతినేని యూకే పార్లమెంట్ ముందు ర్ తెలంగాణ రాష్ట్రంలో హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని నిరసన తెలిపారు. ఇప్పటికైనా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నవీన్ రెడ్డి మరియు రవి రేతినేని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్‌ ఆందోళనలు…

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చి... రేపటికి 420 రోజులు అవుతుందని ఇప్పటివరకు ఆ హామీలు అమలుకు నోచుకోవడం లేదని టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి విమర్శించారు. 420 హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిరసిస్తూ గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు.

Whats_app_banner