SAIL Job Notification: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 317 ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
SAIL Job Notification: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా Steel authority Of India Ltd లిమిటెడ్‌లో ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
SAIL Job Notification: ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ ట్రైనీ పోస్టులను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారిని దేశ వ్యాప్తంగా స్టీల్ అథారిటీ నిర్వహణలో ఉన్న కర్మాగారాలు, గనులు, ప్లాంట్లలో పోస్టింగులు ఇస్తారు.
భర్తీ చేయనున్న పోస్టుల్లో ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ ఉద్యోగాలు 57, ఎలక్ట్రికల్ ట్రైనీ పోస్టులు 64, మెకానికల్ విభాగంలో 100, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో 17, సివిల్ విభాగంలో 22, కెమికల్ విభాగంలో 18, సిరామిక్స్‌లో 6, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 8, కంప్యూటర్స్, ఐటీ విభాగంలో 20, డ్రాఫ్ట్‌మెన్ పోస్టులు 2 భర్తీ చేస్తారు. మార్చి 18వ తేదీలోగా ఆన్‌లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి తర్వాత సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. డిస్టెన్స్, కరెస్పాండెన్స్ డిప్లొమా కోర్సుల్ని పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయడానికి అనర్హులుగా పేర్కొన్నారు. అభ్యర్థులు మెటలర్జీ/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇస్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్/ సివిల్/ కెమికల్, సిరామిక్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఇలా..
దరఖాస్తు చేసే అభ్యర్థులకు 28 ఏళ్లకు మించి వయసు ఉండకూడదు. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపు ఇస్తారు.
జనరల్ క్యాటగిరీతో పాటు ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులకు దరఖాస్తు పీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు రూ.200లను ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్/హిందీ భాషల్లో ఉంటుంది. ప్రశ్నాపత్రంలో రెండు భాగాలు ఉంటాయి. 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
90నిమిషాల వ్యవధిలో సంబంధిత విభాగానికి సంబంధించిన యాభై ప్రశ్నలు, ఆప్టిట్యూట్ టెస్ట్‌లో 50ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో అన్ రిజర్వుడ్, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు 50శాతం మార్కులు, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైన అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థుల్లో 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్టుల్ని సెయిల్ కర్మాగారాల్లో నిర్వహిస్తారు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో పాటు అభ్యర్థులకు ఎలాంటి దృష్టి, వినికిడి సమస్యలు ఉండకూడదు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ఆన్ సైట్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. మొదటి ఏడాది రూ.16వేలు, రెండో ఏడాది రూ.18వేలు స్టైఫెండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత రూ.38,920 వేతనంతో ప్రారంభమవుతుంది.
దరఖాస్తులను ఆన్‌లైన్ మార్చి18వ తేదీ వరకు స్వీకరిస్తారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తుల్ని www.sail.co.inలో సమర్పించాల్సి ఉంటుంది.