TGCAB Recruitment 2024 : తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ - నెలకు రూ. 25 వేల జీతం, ముఖ్య వివరాలివే
Telangana Cooperative Apex Bank Limited Updates : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్(TGCAB) నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కో-ఆపరేటివ్ ఇంటెర్న్స్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. నవంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా… కోఆపరేటివ్ ఇంటెర్న్స్ ను భర్తీ చేస్తారు. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లో కేవలం ఒక ఖాళీ ఉండగా… మరో 9 పోస్టులు డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపారు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని… ఆఫ్ లైన్ లో సబ్మిట్ చేయాలని వివరించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఎంబీఏ (మార్కెటింగ్/ కోఆపరేటివ్/ అగ్రి బిజినెస్/ రూరల్ డెవలప్‌మెంట్) లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. https://tscab.org/notifications/ లింక్ పై క్లిక్ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్
- ఉద్యోగాలు - కోఆపరేటివ్ ఇంటెర్న్స్,
- మొత్తం ఖాళీలు - 10
దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్ - దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 30, నవంబర్ 2024.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. తెలుగు భాష వచ్చి ఉండాలి.
- 21 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంపికైన వారికి నెలకు రూ. 25 వేల జీతం చెల్లిస్తారు. టీఏ, డీఏలను బ్యాంక్ నిర్ణయిస్తుంది.
- ఏడాదిలో పది క్యాజువల్ లీవ్స్ ఉంటాయి.
- అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ పొందవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం