NMDC Hyderabad Jobs 2024 : హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు - దగ్గరపడిన దరఖాస్తుల గడువు..!-nmdc hyderabad junior officer recruitment 2024 applications ends on 10th november 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nmdc Hyderabad Jobs 2024 : హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు - దగ్గరపడిన దరఖాస్తుల గడువు..!

NMDC Hyderabad Jobs 2024 : హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు - దగ్గరపడిన దరఖాస్తుల గడువు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 09, 2024 07:05 AM IST

NMDC Hyderabad Recruitment 2024: 153 జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ గడువు కూడా దగ్గరపడింది. అర్హులైన వారు నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.nmdc.co.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో 153 ఉద్యోగాలు
హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో 153 ఉద్యోగాలు

హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 153 జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు రేపటితో (నవంబర్ 10) పూర్తి కానుంది.

10 విభాగాలు - 153 ఖాళీలు…

మొత్తం 10 విభాగాల్లో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా మైనింగ్ విభాగంలో 56 పోస్టులు, ఎలక్ట్రికల్ విభాగంలో 44 ఉద్యోగాలున్నాయి. ఇక మెకానికల్ విభాగంలో 20 పోస్టులు ఉండగా,… కమర్షియల్ 4. సర్వే-9; కెమికల్- 4; సివిల్- 9; ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఎన్విరాన్‌మెంట్ విభాగంలో ఒక ఖాళీ ఉండగా… జియో అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో మరో 3 జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

అర్హతలు, జీతం వివరాలు…

పోస్టులను అనుసరించి అర్హతలను పేర్కొన్నారు. https://www.nmdc.co.in/careers వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తిస్థాయి నోటిఫికేషన్ చూడొచ్చు. ఆయా విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించాలి. అంతేకాకుండా పని అనుభవం కూడా ఉండాలి.

మొదటగా ట్రైనీ పిరియడ్ ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు. 18 నెలలపాటు ట్రైనీ పిరియడ్ పూర్తి చేసుకున్న తర్వాత.. పూర్తి పే స్కేల్ ను వర్తింపజేస్తారు. నెలకు జీతం రూ.37,000 నుంచి రూ.1,30,000గా ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి. కేటగిరీలవారీగా నిర్ణయించిన అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇది 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇక Supervisory Skill Test కూడా ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా నియామక పత్రాలను అందజేస్తారు.

ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 10, 2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఆప్లికేషన్లను స్వీకరిస్తారు. జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) ఉద్యోగ ఆన్ లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్ : https://jobapply.in/NMDC2024JOTRAINEE/Registration.aspx 

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ హైదరాబాద్ లో ఉద్యోగాలు:

మరోవైపు ప్రభుత్వ రంగంలో మహారత్న కంపెనీగా గుర్తింపు పొందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ హైదరాబాద్ ఏవియేషన్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నాలుగేళ్ల వ్యవధితో టెక్నిషియన్, ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

మెకానికల్ డిప్లొమా టెక్నిషియన్‌ పోస్టులు 8, మెకానికల్ డిప్లొమా ఎఫ్‌ఎస్‌ఆర్ టెక్నిషియన్లు 2, ఎలక్ట్రికల్ డిప్లొమా టెక్నిషియన్లు 2, ఎలక్ట్రికల్ డిప్లోమా ఎఫ్‌‌ఎస్‌ఆర్‌ టెక్నిషియన్లు 1. ఎలక్ట్రానిక్స్‌ డిప్లొమా టెక్నిషియన్ పోస్టులు21, ఎలక్ట్రానిక్స్‌ ఎఫ్‌ఎస్‌ఆర్ టెక్నిషియన్ పోస్టులు 14, కెమికల్ డిప్లొమా టెక్నిషియన్ పోస్ట్ 1, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆపరేటర్ పోస్ట్ 1, ఫిట్టర్ 1, పెయింటర్ 2, టర్నర్ 1 పోస్టు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో 14.5శాతం మాజీ సైనికోద్యోగులకు కేటాయిస్తారు. https://hal-india.co.in/career-details లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Whats_app_banner