TS Inter Exams : నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం, 57 కేంద్రాలు ఏర్పాటు-nizamabad news in telugu ts inter exams preparations 57 centers ready ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Nizamabad News In Telugu Ts Inter Exams Preparations 57 Centers Ready

TS Inter Exams : నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం, 57 కేంద్రాలు ఏర్పాటు

HT Telugu Desk HT Telugu
Feb 22, 2024 07:06 PM IST

TS Inter Exams : ఇంటర్ పరీక్షల నిర్వహణకు నిజామాబాద్ జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 57 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

TS Inter Exams : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల(TS Inter Exams) నిర్వహణ కోసం నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16 ప్రభుత్వ కళాశాలలు, 2 ఎయిడెడ్ కళాశాలలు, 2 సాంఘిక సంక్షేమ కళాశాలలు, 6 మోడల్ కళాశాలలు, 2 మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలు, ఒక బీసీ సంక్షేమ కళాశాల, 26 ప్రైవేట్ కళాశాలలు, ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక ప్రైవేట్ పాఠశాల పరీక్షల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 35,346 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం మొత్తం విద్యార్థులు 17,364 కాగా రెండో సంవత్సరం విద్యార్థులు 17,982 మంది ఉన్నారని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

నిమిషం నిబంధన

నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులకు అనుమతి ఉండదని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ తెలిపారు. ఉదయం 8.30 గంటల వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి(Exam Centers) సెల్ ఫోన్ లను, ఇతర ఏ పత్రాలను, కాగితాలను అనుమతించరు. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా టీఎస్ఆర్టీసీ బస్సులు నడపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్ఎం తో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పరీక్షల నిర్వహణ తర్వాత జవాబు పత్రాల బెండల్ లను పోస్ట్ ఆఫీస్ ల ద్వారా జిల్లా కేంద్రంలోని డీఆర్డీసీ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు పోస్ట్ ఆఫీసుల ద్వారా నిర్వహిస్తున్నారు. మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందంలో రెవెన్యూ అధికారి, పోలీస్ అధికారితో పాటు ఒక సీనియర్ అధ్యాపకుడు ఉంటారు.

విద్యార్థులు ఎలాంటి పుకార్లు నమ్మొద్దు

పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యార్థులు ఎలాంటి పుకార్లు నమ్మొద్దని ఇంటర్ అధికారులు తెలిపారు. పరీక్ష రాసే సమయంలో విద్యార్థిని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కావొద్దన్నారు. బాగా చదివి ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలని సూచించారు. హాల్ టికెట్ ల పంపిణీ విషయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయరాదని అన్నారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులు పరీక్షలు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

రిపోర్టింగ్ : ఎన్.భాస్కర్, నిజామాబాద్

IPL_Entry_Point

సంబంధిత కథనం