PM Modi : కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తా, ఎన్డీఏలో చేర్చుకోమని కేసీఆర్ అడిగారు- ప్రధాని మోదీ-nizamabad induru pm modi sensational comments on kcr asked joining in nda ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pm Modi : కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తా, ఎన్డీఏలో చేర్చుకోమని కేసీఆర్ అడిగారు- ప్రధాని మోదీ

PM Modi : కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తా, ఎన్డీఏలో చేర్చుకోమని కేసీఆర్ అడిగారు- ప్రధాని మోదీ

Bandaru Satyaprasad HT Telugu
Oct 03, 2023 05:43 PM IST

PM Modi : ఎన్డీఏలో చేర్చుకోమని సీఎం కేసీఆర్ తనను అడిగారని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చిందని మండిపడ్డారు.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

PM Modi : తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఇందూరు జనగర్జన సభలో మాట్లాడిన ప్రధాని... బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ దిల్లీ వచ్చి తనను కలిశారని, ఎన్డీఏలో చేర్చుకోవాలని అభ్యర్థించారన్నారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ అడిగారని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాచరికం కాదని కేసీఆర్ కు చెప్పానని, ప్రజలు ఆశీర్వదించిన వాళ్లే పాలకులని చెప్పానన్నారు. ఈ తర్వాత ఎన్నడూ కేసీఆర్ తననను కలవలేదన్నారు. నా కళ్లలోకి చూసి ధైర్యం కేసీఆర్ లేదని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందన్నారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పాటుతో సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు మాత్రమే ధనికులయ్యారని పేర్కొన్నారు.

కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దు

తెలంగాణ యువత కేసీఆర్ కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని ప్రధాని మోదీ కోరారు. కాంగ్రెస్‌ పార్టీని దేశమంతా తిరస్కరించిందన్నారు. ఎన్టీపీసీతో రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుందన్నారు. పెద్దపల్లి ఎన్టీపీసీ పవర్‌ ప్లాంట్‌ను శరవేగంగా పూర్తిచేశామన్నారు. ఈ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో అధిక భాగం తెలంగాణకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ గ్యారంటీలకు ఎన్టీపీసీ నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని ప్రధాని తెలిపారు. త్వరలో భారతీయ రైల్వే 100 శాతం ఎలక్ట్రిఫికేషన్‌ అవుతోందన్నారు.

ఎన్డీఏలో చేర్చుకోమని కేసీఆర్ అడిగారు

"కేసీఆర్ ఎన్డీఏలో చేరతానని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెప్పాం. నేను అలసిపోయాను, కేటీఆర్‌ బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారు. మీరు ఏమైనా రాజులా యువరాజుని సీఎం చేయడానికి అని ప్రశ్నించాను. ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదని చెప్పాను. ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. సీఎం కేసీఆర్‌ అవినీతి బాగోతాన్ని చెప్పాను. ఆ రోజు నుంచి మళ్లీ కేసీఆర్ నన్ను కలవలేదు. నా కళ్లలోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నేతలే కాంగ్రెస్‌కు డబ్బులు అందిచారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ దిల్లీ వచ్చి, నాపై ప్రేమ కురిపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు రావడంతో... ఆ తర్వాత సీన్‌ మారిపోయింది. జీహెచ్‌ఎంసీలో తమకు మద్దతు ఇవ్వమని కేసీఆర్‌ కోరారు" - ప్రధాని మోదీ

Whats_app_banner