Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో దారుణం, కత్తితో దాడి గొంతు కోసి పరారీ!
Nizamabad Crime : నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గొట్ లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి స్థానికంగా నివసిస్తు్న్న రాములు అనే వ్యక్తి గొంతు కోశాడు.
Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు కూలి గొంతు కోసి పరారయ్యాడు. దీంతో అర్ధరాత్రి నుంచి రక్తపు మడుగులోనే ఉన్న కూలి తెల్లవారుజామున ఇంటికి వచ్చి ఇంటి ముందు పడిపోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గొట్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... రామారెడ్డి మండలం పోసానిపెట్ గ్రామానికి చెందిన పిట్ల రాములు సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్ గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చాడు. కొంతకాలంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే శుక్రవారం అర్ధరాత్రి చిన్నవాల్గోట్ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు రాములు. రాత్రి నుంచి అక్కడే పడిపోయాడు. ఉదయం 4 గంటల సమయంలో కత్తి గాయంతోనే తన ఇంటికి వచ్చి గుమ్మం ముందు పడిపోయాడు. శనివారం ఉదయం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు తలుపులు తీసే సమయానికి స్పృహతప్పి పడి ఉన్న రాములను గమనించి అంబులెన్సు లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టైలర్ షాపునకు వెళ్లి వస్తానని అమ్మాయి అదృశ్యం
టైలర్ షాపునకు వెళ్లి వస్తానని చెప్పిన అమ్మాయి అదృశ్యమైన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన పదహారేళ్ల అమ్మాయి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.