NIT Warangal Jobs 2024 : వరంగల్‌ 'నిట్'లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే-nit warangal issued recruitment notification for non teaching positions 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nit Warangal Jobs 2024 : వరంగల్‌ 'నిట్'లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే

NIT Warangal Jobs 2024 : వరంగల్‌ 'నిట్'లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 28, 2024 12:08 PM IST

NIT Warangal Recruitment 2024 :వరంగల్‌లోని ‘నిట్’(NIT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ - టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పది ఖాళీలను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

నిట్‌ వరంగల్‌లో ఉద్యోగాలు 2024
నిట్‌ వరంగల్‌లో ఉద్యోగాలు 2024

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా పది నాన్  టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://nitw.ac.in/Careers/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్), వరంగల్
  • ఉద్యోగాలు - నాన్ - టీచింగ్ పోస్టులు
  • మొత్తం ఖాళీలు - 10 (ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్‌ - 02, ప్రిన్సిపల్ స్టూడెంట్స్‌ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ - 01, Deputy Registrar - 02, అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 01, టెక్నికల్ ఆఫీసర్‌ - 01, అసిస్టెంట్ ఇంజినీర్‌ - 03)
  • పై పోస్టుల్లో కొన్ని డైరెక్ట్ రిక్రూట్ మెంట్, మరికొన్ని డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
  • పోస్టును అనుసరించి విద్యార్హతలను పేర్కొన్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు
  • దరఖాస్తు - ఆన్ లైన్
  • దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.
  • దరఖాస్తులకు చివరి తేదీ - సెప్టెంబర్ 09, 2024.
  • దరఖాస్తు ఫీజు - రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
  • ఎంపిక విధానం - వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆయా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/Careers/
  • ఏమైనా సందేహాలు ఉంటే recruit_admn@nitw.ac.in మెయిల్ అడ్రస్ ద్వారా సంప్రదించవచ్చు.