Women Missing In Forest : రాత్రంతా దట్టమైన అడవిలో చిక్కుకున్న నలుగురు మహిళలు-nirmal police rescued four women labourers missing in thick forest search operation at night ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Women Missing In Forest : రాత్రంతా దట్టమైన అడవిలో చిక్కుకున్న నలుగురు మహిళలు

Women Missing In Forest : రాత్రంతా దట్టమైన అడవిలో చిక్కుకున్న నలుగురు మహిళలు

HT Telugu Desk HT Telugu

Women Missing In Forest : తునికాకు కోసం అడవిలోకి వెళ్లిన నలుగురు మహిళలు.. తప్పిపోయారు. సిగ్నల్స్ కూడా లేకపోవడంతో అడవిలో చిక్కుకున్నారు. గ్రామస్థుల సమాచారంలో రంగంలోకి దిగిన పోలీసులు అడవిని జల్లెడ పట్టి నలుగురు మహిళలను రక్షించారు.

రాత్రంతా దట్టమైన అడవిలో చిక్కుకున్న నలుగురు మహిళలు

Women Missing In Forest : ఉత్కంఠకు తెరపడింది. ఆకు సేకరించేందుకు అడవిలోకి వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళలు సురక్షితంగా ఇంటికి చేరారు. దాదాపు 6 గంటల పాటు అడవిని మొత్తం జల్లెడ పట్టిన పోలీసులు చివరికి తప్పి పోయిన మహిళల్ని గుర్తించి గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు మహిళలు రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్టు మేడి లక్ష్మి, బత్తుల సరోజ గురువారం రోజున ఉదయం ఆ నలుగురు ఉపాధి నిమిత్తం తునికాకు సేకరణకు తునికాకు సేకరణకు వెళ్లారు.

అనుకోకుండా అడవిలో చిక్కుకుపోయారు, అదే సమయంలో మబ్బులు కమ్ముకుపోవడంలో అడవిలో చీకటి ఆవరించింది, దీంతో మహిళలకు దారి తెలియకుండా పోయింది. తిరిగి తిరగాలిసిపోయి వేలోకి చేరడంతో గంటలు కొద్ది అక్కడే బిక్కుబిక్కుమంటు కాలం వెళ్ల తీశారు. మహిళల్లో ఇద్దరికీ సెల్ఫోన్ ఉన్నప్పటికీ సిగ్నల్ లేకపోవడంతో ఫోన్ చేయలేని పరిస్థితి నెలకొంది. చాలాసేపు సిగ్నల్ కోసం విఫలయత్నం చేశారు. అయినప్పటికీ రాత్రి కావడంతో చేసేదేం లేక అదే లోయలో బిక్కుబిక్కుమంటూ కూర్చుని పోయారు. కేవలం రెండే రెండు మంచినీళ్లు చేశారని అతి జాగ్రత్తగా ఉపయోగించుకున్నారు. మహిళలు రాత్రి 8 గంటల వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గ్రామస్తులతో కలిసి పోలీ సులకు సమాచారం అందించారు.

గ్రామస్తులు, పోలీసులు కలిసి తనిఖీలు

పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని, గ్రామస్తులతో కలిసి 50 మందితో రెండు బృందాలుగా ఏర్పడి రాత్రంతా గాలింపు చేపట్టారు. ఎస్పీ జానకీ షర్మిల హుటాహుటిన స్పందించారు, ఏఎస్పీ రాజేష్ మీనా కుంబింగ్ నిర్వహించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడి వరకు ఆగిపోయాయి అనే దృష్టితో లొకేషన్లు గుర్తించే ప్రయత్నం సఫలం కాలేదు. ఈ లోపు మహిళలే ఒక పెద్ద గుట్టను ఎక్కి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వారున్న జాడ తెలియడంతో పోలీసులు ట్రాక్టర్ సహాయంతో గ్రామానికి సురక్షితంగా తీసుకొచ్చారు. దాదాపు 14గంటలకు పైగా సాగిన ఉత్కంట కు తెరపడింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇన్స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి, శేఖర్, రమేష్, సబ్ ఇన్స్పెక్టర్లు, మహిళా పోలీసు బృందాలు పాల్గొన్నారు. మహిళల్ని సురక్షితంగా గ్రామానికి తీసుకొచ్చిన పోలీసు బృందాలను - గ్రామస్థులు సత్కరించారు. వారందరికీ గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.

రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

HT Telugu Desk

సంబంధిత కథనం