Nirmal Accident : నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- లారీ, బస్సు ఢీ, ఒకరి మృతి, 30 మందికి పైగా గాయాలు-nirmal major road accident lorry and bus collide near narsapur one dead more than 30 injured ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nirmal Accident : నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- లారీ, బస్సు ఢీ, ఒకరి మృతి, 30 మందికి పైగా గాయాలు

Nirmal Accident : నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- లారీ, బస్సు ఢీ, ఒకరి మృతి, 30 మందికి పైగా గాయాలు

HT Telugu Desk HT Telugu

Nirmal Accident : నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నర్సాపూర్ వద్ద లారీ, బస్సు ఢీ- ఒకరి మృతి, 30 మందికి పైగా గాయాలు

Nirmal Accident : నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం తూరాటి ఎక్స్ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలం రాజుర నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు నిర్మల్ నుంచి భైంసా వైపు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇందులో గాయపడిన ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

30 మందికి గాయాలు... ఒకరు మృతి

నర్సాపూర్ (జి) తూరాటి గ్రామం వద్ద జరిగిన లారీ, బస్సు ఢీకొన్న ప్రమాదంలో మొత్తం 30 మందికి పైగా గాయాల పాలయ్యారని స్థానికులు తెలిపారు. ఒకరికి తీవ్రంగా గాయాలు కావడంతో నిర్మల్త్ జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించే లోపు లారీ డ్రైవర్ మృతి చెందాడని పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు 5 అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదస్థలంలో మరికొందరికి ప్రథమ చికిత్స చేసి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. లారీ డ్రైవర్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.

రిపోర్టింగ్: వేణుగోపాల కామోజీ, ఉమ్మడిదలాబాద్ జిల్లా హిందుస్థాన్ టైమ్స్

HT Telugu Desk

సంబంధిత కథనం