NIRDPR Hyderabad Jobs 2024: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు - నెలకు రూ. 40 వేల జీతం, ముఖ్య వివరాలివే
NIRDPR Hyderabad Recruitment 2024: హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీపీఆర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా రీసెర్చ్ అసిస్టెంట్, కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు పది ఉండగా… కన్సల్టెంట్ ఖాళీలు 4 ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆయా పోస్టులకు పీజీ అగ్రికల్చర్, పీహెచ్డీ, ఎంబీఏను అర్హతలుగా పేర్కొన్నారు. పోస్టును బట్టి అర్హతలు ఉన్నాయి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి. పూర్తి వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు.
రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 22వేల జీతం చెల్లిస్తారు. కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 40 వేల జీతం ఇస్తారు. రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదని స్పష్టం చేశారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
http://career.nirdpr.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ECIL ప్రకటన:
హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా 64 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.నవంబర్ 7, 11 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 64 ఖాళీలను రిక్రూట్ చేస్తారు. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు, ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలు, కోల్ కత్తా, మీరట్, ఢిల్లీ, పూణె, నాగ్ పూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కైగా కేంద్రాల్లో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను https://www.ecil.co.in/ వెబ్ సైట్ నుంచి తీసుకోవాలి. మీ వివరాలను పూర్తి చేయాలి. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ సౌత్ జోన్ లో నవంబర్ 11వ తేదీన ఇంటర్వూలు ఉంటాయి.వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. వారు మాత్రమే రావాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్