Niranjan Reddy on Rythu Bandhu : రైతుబంధుపై ఊహాజనిత కథనాలు సరికాదు : మంత్రి నిరంజన్ రెడ్డి-niranjan reddy suggests media to give accurate information on rythubandhu funds disbursement ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Niranjan Reddy Suggests Media To Give Accurate Information On Rythubandhu Funds Disbursement

Niranjan Reddy on Rythu Bandhu : రైతుబంధుపై ఊహాజనిత కథనాలు సరికాదు : మంత్రి నిరంజన్ రెడ్డి

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (facebook)

Niranjan Reddy on Rythu Bandhu : రైతుబంధుపై ఊహాజనిత కథనాలు రాసి రైతులను గందరగోళానికి గురిచేయాలనుకోవడం దురదృష్టకరమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం నిధుల విడుదలపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించిన మంత్రి.... మీడియా మితిమీరిన ధోరణి సరికాదని సూచించారు.

Niranjan Reddy on Rythu Bandhu : రైతుబంధు పథకం విషయంలో మీడియా మితిమిరీన ధోరణి సరికాదని.... అరకొర సమాచారంతో.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న అత్యుత్యాహం మంచిదికాదని... వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. డిసెంబరు 28 నుంచి జనవరి 18 వరకు రైతుబంధు పథకం కింద నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిందన్న మంత్రి... దానికి అనుగుణంగా ప్రతి రోజు నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు.. రైతుబంధు పథకం నిధుల విడుదలపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించిన మంత్రి.... మీడియా మితిమీరిన ధోరణి సరికాదని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

రైతుబంధు పదో విడత సాయం కింద.. ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు ఉన్న 54 లక్షల 70,637 మంది రైతుల ఖాతాలలో రూ. 4,327.93 కోట్లు జమ చేశామని మంత్రి వివరించారు. నిధుల జమ చేయడం ప్రారంభించి ఎనిమిది రోజులు అయ్యింది కాబట్టి ఎనిమిది ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో నిధులు పడాల్సిందే అని ఊహించుకుని ఊహాజనిత కథనాలు రాసి.... రైతులను గందరగోళానికి గురి చేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. ఎనిమిది ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమచేసినట్లు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని... ఏ రోజు ఎంత మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేశామో అదే మీడియాకు విడుదల చేయడం జరుగుతోందని చెప్పారు.

నిధుల కొరత ఉన్నా, కేంద్రం వివిధ రకాలుగా తెలంగాణ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా, కరోనా విపత్తు వచ్చినా గత 9 విడతలుగా రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానిదని నిరంజన్ రెడ్డి అన్నారు. పదో విడత రైతుబంధు నిధులు కూడా విజయవంతంగా రైతుల ఖాతాలలో జమచేయడం జరుగుతోందని.. అరకొర సమాచారంతో, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న అత్యుత్సాహం మీడియాకు సరికాదని సూచించారు. కనీస సమాచారం, వివరణ తీసుకోకుండా వార్తను ప్రచురించడం అంటే కేవలం ప్రభుత్వ పథకాల మీద బురదజల్లాలన్న ఆలోచన ఉన్నట్లు అర్దమవుతోందని అన్నారు. గత యాసంగి సీజన్ లో కూడా డిసెంబరు ఆఖరులో మొదలుపెట్టి సంక్రాంతి వరకు నిధులు జమ చేశామని... ఈ సారి కూడా గతంలో మాదిరిగానే రైతులకి పెట్టుబడి సాయం నిధులు అందుతున్నాయని వివరించారు.

WhatsApp channel