NFC Hyderabad Recruitment : 300 అప్రెంటిస్ ఖాళీలు - హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌ నోటిఫికేషన్, వివరాలివే-nfc hyderabad inviting the applications from iti passed out candidates for one year apprenticeship training ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nfc Hyderabad Recruitment : 300 అప్రెంటిస్ ఖాళీలు - హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌ నోటిఫికేషన్, వివరాలివే

NFC Hyderabad Recruitment : 300 అప్రెంటిస్ ఖాళీలు - హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌ నోటిఫికేషన్, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 17, 2024 09:53 AM IST

Nuclear Fuel Complex Hyderabad : హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 300 అప్రెంటిస్‌షిప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్‌ 25వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. వివరాలను పూర్తి కథనంలో చూడండి

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు

హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://www.nfc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ , మోటార్ మెకానిక్స్(వెహికల్‌), డ్రాఫ్ట్స్‌మ్యాన్, సీఓపీఏ, డీజిల్‌ మెకానిక్, కార్పెంటర్‌, ప్లంబర్‌, అటెండెంట్ ఆపరేటర్/ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్, వెల్డర్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్) విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండకూడదు.

ఎంపికైన వారికి నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 స్టైఫండ్ అందుతుంది. విద్యార్హతలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారని నోటిఫికేషన్ తెలిపారు.

అప్లికేషన్ అసంపూర్ణంగా ఉంటే తిరస్కరణకు గరువుతుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. Trade Electrician ఖాళీల భర్తీకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైన తర్వాత అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. వీటి వివరాలను కూడా పేర్కొన్నారు.

  • పదో తరగతి మార్కుల మెమో
  • ఐటీఐ ఉత్తీర్ణత సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణపత్రం
  • ఆధార్ కార్డు
  • పోలీస్ వెరిఫికేషన్ ధ్రువపత్రం ఉండాలి.
  • అకౌంట్ బ్యాంక్ బుక్
  • అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీ
  • ఫొటోలు

మరోవైపు హైదరాబాద్ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (IICT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మొత్తం 31 సెంటిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లోనే అప్లికేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల వయసు 32 ఏళ్ల లోపు ఉండాలి. ఆర్గానికి కెమిస్ట్రీ, అగ్రో కెమిస్ట్రీ, ఇన్ ఆర్గానికి కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్గానిక్ కోటింగ్, పాలిమర్స్, కెమికల్ బయాలజీతో పాటు డిజైన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి రూ. 1,34,907 జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ చేసి ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో వివరించారు. అభ్యర్థుల షార్ట్‌ లిస్టింగ్‌ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://www.iict.res.in/g4recruitment/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 09, 2024 తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరించరు. నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును https://www.onlinesbi.sbi/sbicollec లింక్ పై క్లిక్ చేసి చెల్లించుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం