Hyd Traffic Rules: గీత దాటితే 100, అడ్డుపడితే 1000.. కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే
hyderabad new traffic rules: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Hyderabad New Traffic Rules 2022: ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. అక్టోబర్ 3 నుంచి కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకోనున్నారు.
స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధించనున్నారు. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు వస్తువులు పెడితే భారీ జరిమానా విధిస్తామని తెలిపారు. పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే రూ.600 ఫైన్ విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని నగర ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. కొత్త నిబంధనలను వాహనదారులు తప్పక పాటించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే ట్విన్ సిటీస్ లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, మితి మీరిన వేగంతో దూసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు నిలిపినా... భారీగా జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నడటంతో వాహనాదారులు బీ అలర్ట్ గా ఉండాల్సిందే.
ట్రాఫిక్ చలాన్లపై.. తెలంగాణ రవాణా శాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై వాట్సాప్‌లోనూ చలాన్లు రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. నిర్ణయం తీసుకున్నారు. వాహన యజమానులు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నివాస చిరునామా వివరాలు, ఫోన్ నంబర్‌ను కూడా ఇస్తారు. రవాణా శాఖ దగ్గర.. వాహనాదారుల వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అందుకు సంబంధించిన చలాన్ అప్ డేట్ వాట్సాప్‌కు కూడా ఫార్వార్డ్ చేయనున్నారు. ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది.