TG Govt Schools: సర్కార్ బడిలో చేరాలంటూ సరికొత్త ప్రచారం, ఏఐ సాయంతో వినూత్న వీడియోలతో ఉపాధ్యాయుల ప్రచారం-new campaign to join govt schools teachers campaign with innovative videos with the help of ai ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Schools: సర్కార్ బడిలో చేరాలంటూ సరికొత్త ప్రచారం, ఏఐ సాయంతో వినూత్న వీడియోలతో ఉపాధ్యాయుల ప్రచారం

TG Govt Schools: సర్కార్ బడిలో చేరాలంటూ సరికొత్త ప్రచారం, ఏఐ సాయంతో వినూత్న వీడియోలతో ఉపాధ్యాయుల ప్రచారం

HT Telugu Desk HT Telugu
May 30, 2024 12:50 PM IST

TG Govt Schools: సర్కారీ బడుల్లో చేరితే ఎన్ని ప్రయోజనాలు ఉంటే వివరిస్తూ వీడియోలతో ప్రచారం చేస్తూ విద్యార్ధులను ఆకట్టుకుంటున్నారు కరీంనగర్ ఉపాధ్యాయులు..

ఏఐ వీడియోలతో ప్రభుత్వ స్కూళ్ల సదుపాయాలపై ప్రచారం
ఏఐ వీడియోలతో ప్రభుత్వ స్కూళ్ల సదుపాయాలపై ప్రచారం

TG Govt Schools: విద్యా సంవత్సరం ఆరంభానికి సమయం దగ్గరపడింది... పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మద్య అడ్మిషన్ ల పోటీ జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల టీచర్ లు బడిబాట చేపట్టి అడ్మిషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

సర్కార్ బడిలో చేరితో అన్ని ఫ్రీ అంటు టీచర్లు ఇంటింటికి తిరిగి పిల్లలను బడిలో చేర్పించే పనిలో నిమగ్నంకాగ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరు టీచర్లు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) యాంకర్ ద్వారా ప్రచారం సాగిస్తున్నారు.

ప్రస్తుతం ప్రతిఇంటా స్మార్ట్ ఫోన్ లు ఉండడంతో సోషల్ మీడియా ద్వారా ఏఐ తో సర్కార్ బడిలో చేరితే ఏలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు టీచర్లు ఏఐ తో ప్రచారం సాగిస్తు అందరిని ఆకట్టుకుంటున్నారు.

రామంచ బడిలో...

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్ షరీప్ అహ్మద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. బడిబాటలో బాగంగా తమ బడిలో చేరాలని ప్రచారం సాగిస్తున్నారు.

పాఠశాల పరిసరాలు,విద్యార్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఏఐ యాంకర్ ద్వారా వీడియో తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. సర్కార్ బడిలో చేరితే ఫీజులు ఉండవు...అడ్మిషన్ టెస్ట్ లేదు... ఉచితంగా విద్యా, ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్క లు అందజేయడం జరుగుతుంది.

అడ్మిషన్ పీజలు ఉండవు.. రెండు జతల స్కూల్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది. మద్యాహ్నం బొజనం పెట్టడం జరుగుతుందని, ఆహ్లాదకరమైన వాతావరణంలో క్వాలిపైడ్ టీచర్లతో విద్యాబోధన అందించడం జరుగుతుందని, విద్యార్ధుల సంక్షేమం కోసం పాటు పడుతోందిని ఏఐ యాంకర్ ద్వారా చెప్పించి ప్రచారం చేస్తున్నారు.

బడిబాటతో గ్రామంలో పర్యటించి పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడంతోపాటు ఏఐ ద్వారా ప్రచారం చేయడం గ్రామస్థులను ఆకట్టుకుంది. సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకని ప్రజలకు సర్కార్ బడిని మరింత చేరువయ్యేలా ఏఐ ద్వారా ప్రచారం చేస్తున్నానని ఏఐ వీడియో రూపొందించిన హిందీ టీచర్ షరీప్ అహ్మద్ తెలిపారు.

వట్టెంల పాఠశాల ప్రధానోపాద్యాయులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టెంల హైస్కూల్ హెడ్ సూర్యనారాయణ సైతం స్కూల్ లో విద్యార్ధుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేకంగా ఏఐ ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఏడాది సెంచరి అడ్మిషన్ల రికార్డు సృష్టించాలని ప్రైవేటు పాఠశాలల కన్నా మెరుగైన విద్య అందించే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

మ్యాథ్స్ టీచర్ అయినప్పటికీ సాంకేతికపై పట్టు సాధించి వినూత్న ప్రచారంతో అందరిని ఆకట్టుకుంటున్నారు. వట్టెంలా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల ఎలాంటి సౌకర్యాలు వివరిస్తారో తెలియజేస్తూ ఏఐ యాంకర్ తో చెప్పించారు. డిజిటల్ విద్యాబోధన కూడా సాగుతున్న వట్టెంల పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారైందని వివరించే ప్రయత్నం చేశారు.

కంప్యూటర్లు కూడా పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం విద్యతో పాటు ఉచితంగా మద్యాహ్న భోజనం అమలు చేస్తోందని, ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్ కూడా ఇస్తోందని వివరించారు. ఏఐ యాంకర్ గా తయారు చేసిన వీడియోను వట్టెంలతో పాటు సమీపంలోని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు.

సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వట్టెంల ప్రభుత్వ పాఠశాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మేలన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్న సంకల్పంతోనే ఏఐ టెక్నాలజీని వినియోగించానని సూర్యనారాయణ తెలిపారు.

ఇద్దరిని చూసి మరికొందరు...

ప్రస్తుతం ఇద్దరు టీచర్లు ఏఐ ద్వారా సర్కార్ బడిలో అడ్మిషన్ లను పెంచే ప్రక్రియ చేపట్టిన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మరికొందరు టీచర్లు అదే పనిలో నిమగ్నమయ్యారు. తమకున్న సాంకేతిక పరిజ్ఞాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏఐ యాంకర్ ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంజలిజెన్స్ ద్వారా ప్రచారం సాగించడం ద్వారా చదువురాని గ్రామీణ ప్రాంత పేరెంట్స్ సైతం అర్థం చేసుకుని పిల్లలను సర్కార్ బడిలో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఏఐ యాంకర్ ద్వారా ప్రచారమే కాదు రాబోయే రోజుల్లో పాఠాలు సైతం బోదిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలా అయితే సర్కార్ బడిలో టీచర్ల కొరత తీరినట్లేనని జనం భావిస్తున్నారు.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

Whats_app_banner